• 9985781915 ; 9014964715
  • జ్యోతిషనిపుణులు, దుర్గగుడివద్ద, లలితానగర్, రాజమండ్రి - 533 105

About Me

బృహస్పతి వాక్కు :
బృహస్పతి వాక్కు :

---మన ప్రవర్తనే - మన భవిష్యత్తు---
 
ఈ జ్యోతిష గ్రంధ రచనలు రూపకల్పన చేసిన జ్యోతిష నిపణులు శ్రీ ఉప్పులూరి శేషగిరిరావు గారు విద్యార్థిదశ నుంచి నాకు పరిచయం. వారు. వారి సతీమణి. వారి పిల్లలు అందరూ నాకు ప్రియ శిష్యులే. వారి నిరాడంబరత, వినయము, విధేయత, సంస్కారముతో పాటు సమాజంకోసం ఏదో మంచి పని చేయాలనే తపన కలిగినవారు. కుటుంబ మంతా జ్యోతిషులే, వారు గత ముప్ఫయి సంవత్సరములనుంచి జ్యోతిష పరంగా కృషి చేస్తూనే ఉన్నారు. సంఘానికి మిత్రునిగా డబ్బుని ఆశించకుండా మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు కాకుండా వచ్చిన వ్యక్తికి మాట్లాడే సమయంలోనే ఎంతో కొంత ఉపశమనం కలిగించే శక్తి, గుణం ఆయనలో ఉన్నాయి. వారు జ్యోతిష, ముహూర్త, వాస్తు, ప్రశ్న భాగములలో శ్రేష్టడగుటయేగాక ఆయన్ని ఒక సైకాలజిస్ట్లుగా కూడా అనవచ్చును. ఆయన వద్దకు జ్యోతిష సలహాకొరకు మొదట వెళ్ళి తరువాత మరొక సారి కౌన్సిలింగ్ కు కూడా ఆయన్నికలుసుకుంటూ ఉంటారు. వారు చెప్పిన సమయానికి ఎంతోమందికి వివాహాలు జరిగాయి. ఉద్యోగాలు వచ్చాయి. సంతానం లేనివారికివారు చెప్పిన శాంతులు ఆచరించి సంతానం పొందినవారు కూడ ఉన్నారు.
 
ఈ ప్రచురణలు నవగ్రహ జప దానములు, హోమశాంతులు ఒనర్చలేనివారికి వర్తమానములో గ్రహ గతులు అనుకూల అననుకూలమైనప్పటికి కుప్తముగా నిత్యము గ్రహశాంతి కలిగేటట్లుగా జ్యోతిష పరంగా ఏఏ అష్టోత్తర శతనామావళిలు రోజువారి నిత్యపారాయణ చేసుకొనవచ్చునో తెలియచేస్తూ మరియు వివాహ వ్యవస్థపై కజగ్రహ ప్రభావము, వివాహ వ్యవస్థపై తల్లితండ్రుల ఆశక్తి సంతానలేమి పైకుజగ్రహ ప్రభావము, వధూవర పొంతనలో సందేహాలు, నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుట, రత్నధారణ విధానము, ముహూర్త సంశయాలు, ఏలినాటి శని, స్వర్గం-నరకం విచారణ, దేవతార్చన అవసరము ఇత్యాది జ్యోతిష పరంగా వారి అనుభవాల్ని ప్రకటితం చేశారు. వారి అనుష్టానము, వారి దైవభక్తి గురుభక్తివారిని వారి కుటుంబాన్నిఇంకా ఉచ్ఛస్థితికి తీసుకువెళ్ళాలని ఈ ప్రచురణ అందరికి ఉవయోగపడాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సర్వేజనా:సుఖినోభవంతు.
 
               "మహామహోపాధ్యాయ"
               ఆచార్య డా., దోర్భల ప్రభాకర శర్మ  యం.ఎ.,పి.హెచ్.డి
               (సంస్కృత భాషా పరిరక్షకులు)
 
-----ఇక్కడ గ్రహాలకు శాంతి చెయ్యి - పైన ఉన్న గ్రహాలు అనుగ్రహిస్తాయి.-----