• 99857 81915
 • ఉప్పలూరి శేషగిరిరావు,
 • జ్యోతిషనిపుణులు, దుర్గగుడివద్ద, లలితానగర్, రాజమండ్రి - 533 105

Article Detail

14. పతి వ్రతముచే - స్త్రీ ఆదిశక్తి

14. పతి వ్రతముచే - స్త్రీ ఆదిశక్తి

స్త్రీ తమ భర్తని పరమేశ్వరునిగా భావించాలి. వినుగులేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా దానధర్మాలు చేయరాదు. ఇరుగుపొరుగు ఇళ్లకు తరచు వెళ్లరాదు. తప్పనిసరి అయినపుడు ఇంట్లో మరొక మనిషితో వెళ్లి పని చూసుకు రావాలి. ఒంటరిగా ఎచటికి ఎప్పడూ వెళ్లరాదు. దుష్టప్రవర్తన గల స్త్రీలతో స్నేప్రాం చేయరాదు. భర్త బయట నుంచి రాగానే సంతోషంగా ఎదురేగి స్వాగతించి అలసట తీరువరకు సేదతీర్చాలి. అతని ఇష్టాన్ని అనుసరించి ఆరోగ్యకరమైన ప్రీతికరమైన భోజనము పెట్టి తదుపరి తను భుజించాలి. భర్త నిద్రించిన తరువాతనే తను నిద్రపోవాలి. అతను నిద్ర మేల్కొనగానే అవసరమైన ఉపచారములు చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని భర్తకు పూజాద్రవ్యాలు స్వయంగానే సమకూర్చి పెట్టాలి. భర్త సంతోషంగా ఉన్నప్పడు తాను విచారంగాను, భర్త విచారంగా ఉన్నప్పడు తాను నంతోషంగాను ఉండరాదు. భర్త కోపగించుకానే వరిస్థితి తెచ్చుకొనరాదు. ఒకవేళ వరిస్థితి వచ్చినను శాంత వరచుకొనవలెను, మాటలను మనసులో ఉంచుకొనరాదు. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాదులు, ఉపవాసాలు చేయరాదు. తీర్థ యాత్రలకు వెళ్లరాదు. ఆయన ఆజ్ఞను అనుసరించి మాత్రమే భార్య నడుచుకోవలెను. భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి. మాంగళ్యాభివృద్ధికి పనుప కుంకుమ మంగళ సూత్రాలు భక్తితో ధరించాలి. ఉమ్మడి కుటుంబమునుంచి వేరుపడుటకు ప్రయత్నించరాదు. శ్రీమంతులను చూచి భర్తను తేలిక భావముతో చూడరాదు. భర్త ఏ పరిస్థితులలో ఉన్నవ్పటికిని వృత్తి, హోదా) అతనిని వరమేశ్వరునిగానే భావించాలి. స్త్రీ యథేచ్ఛగా సంచరిస్తే తన పుణ్యము నశించి నరకానికి దారితీస్తుంది. మరొక పతివ్రత పాదధూళితో గాని వారి పావము నశించదు. పతివ్రతలవలన వంశాభివృద్ధి, పరుషార్థాలు వివాహమాడిన భాగ్యశీలికి సిద్ధిస్తాయి. ఆమెలేక యజ్ఞయాగ ధర్మాలు ఫలంకావు. అట్లాంటి స్త్రీ వల్లే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. గంగాస్నానమువల్ల వచ్చే పణ్యం పతివ్రతను దర్శించటమువలన కూడా కలుగుతుంది అనుటలో సందేహము లేదు. అటువంటి పతి వ్రతముచే స్త్రీ దేవతాశక్తిగా, ఆదిశక్తిగా పిలువబడుతోంది.
 
పతివ్రత ఇంట శాంతి నెలకొని ఉంటుంది. అందరూ తమతమ ధర్మములు నిర్వర్తించేవారుగా ఉంటారు. ఆమె గుణములు ప్రభావము ఇరుగుపొరుగువారిమీద కూడ పడుతుంది. చిన్నతనంలో కుటుంబములో మంచి శిక్షణ, మంచి సాంగత్యము లభించటంద్వారా ధార్మిక భావాల ప్రాబల్యం ఏర్పడి వివాహానంతరము చక్కటి పాతివ్రత్యంతో స్త్రీ నడుచుకొనగలదు. తమ ధర్మాన్ని ఆచరించడానికి అందరికి స్వతంత్రము ఉంటుంది. పతివ్రతా ధర్మాన్ని ఆచరించుటకు కాలమేమి
అడ్డంకి కాదు.
 
---ఇక్కడ గ్రహాలకు శాంతి చెయ్యి - పైన ఉన్న గ్రహాలు అనుగ్రహిస్తాయి.---

Related Articles
 • 1.కుజగ్రహము - అనుగ్రహము

  1.కుజగ్రహము - అనుగ్రహము

 • 2. సమాజము - వివాహ వ్యవస్థ

  2. సమాజము - వివాహ వ్యవస్థ

 • 3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

  3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

 • 4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

  4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

 • 5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా

  5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా