• 9985781915 ; 9014964715
  • జ్యోతిషనిపుణులు, దుర్గగుడివద్ద, లలితానగర్, రాజమండ్రి - 533 105

Article Detail

2. సమాజము - వివాహ వ్యవస్థ

2. సమాజము - వివాహ వ్యవస్థ

చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది నమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృపాస్థాశ్రమము వినా మరో మార్గాంతరము లేదు. (పితృ ఋణ - ఋషిఋణ-దేవ ఋణము)గృహస్థాశ్రమము వలన త్రివిధములైన కామములను సిద్ధించును. (ధర్మ- అర్ధ-కామ) ఇట్టి గృహస్థాశ్రమమునకు ఆధారము పరుషునికి స్త్రీ అయి ఉన్నది. అట్టి స్త్రీ సత్ర్పవర్తనతోను, సమస్కారవంతముగను, భర్తతో న్యాయబద్ధముగా ఉండి ప్రవర్తించవలెను. అట్టి స్త్రీని భార్యగా పొందుటకు గాను శుభలగ్నము చూచి వివాహమును జరిపించవలెను అని కశ్యప వచనము.           
ఇక నేటి సమాజంలో అమ్మాయిల తల్లిదండ్రుల ఆలోచనలు చాలా డిఫరెంటుగా ఉంటున్నాయి. అమ్మాయి కాలేజీ స్టడీస్ వచ్చేసరికి మన సంబందీకులు ఎవరైనా అమ్మాయిని చదివిస్తారా, పెండ్లి చేస్తారా? అని అంటే వెంటనే ఇంకానయం మంచిపనే అమ్మాయి PG చేయాల్సిందే, ఏదో ఒక ఉద్యోగంలో చేరి స్థిరపడిన తర్వాత మాత్రమే, అప్పుడు పెండ్ల గురించి ఆలోచిస్తాము అంటున్నారు. అమ్మాయికి ఎందుకండి ఉద్యోగము అంటే లేదు లేదు ప్రస్తుత సమాజంలో వరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమీ తెలియటంలేదు. రేపు ప్రొద్దుట ఏదైనా ఇబ్బంది రావచ్చు, వాడు చూడచ్చు చూడకపోవచ్చు. వేరే ఏదైనా కావచ్చు, అప్పుడు తన పరిస్థితి ఏమిటి? తన కాళ్ళమీద తను బ్రతకాలి కదా అంటున్నారు. అంటే అమ్మాయి తల్లితండ్రుల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంక మగపిల్లలయితే ఈ స్పీడు ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల్లో వివాహం అవసరమంటారా? అని పెద్దవాళ్ళని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు ప్రశ్నించటములో తప్ప లేదనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య ఒకసీరియల్లో ఒక సంస్థ యండీ తన లేడీ సెక్రటరీతో బయటకు కారులో వెళుతూ మనము ఇలా కలసి బయటికి వెళుతున్నాము మీ ఆయన ఏమైనా అనుకోడు కదా అని సెక్రటరీతో అంటే వెంటనే ఆ లేడీ సెక్రటరీ నా మొగుడా! వాడికంత సీమలేదులే. వాడిని చేసుకున్నదే కేరాఫ్ అడ్రస్ కొసము. నేను ఇలా యంజాయ్ చేయ టానికే కదా అని అంది. కోట్లాదిమంది జనం చూస్తూ ఏ రకమయిన భావోద్వేకానికి గురి అవుతారు? మొదటిగా మాట విన్నప్పడు బ్లడ్ లో చైతన్యం వస్తుంది. అదే ఇష్యూని కంటితో చూసినప్పుడు మరికొంత చైతన్యము ఏర్పడుతుంది. వీటి ప్రభావం వల్ల మానసిక ఆందోళన పెరిగి తద్వారా మనిషిలో కదలికలు ఏర్పడి మనిషి ఒకవైపునుండి మరొకవైపుకు వస్తువు మీదకు గాని తత్సంబందమైన వ్యక్తిమీదకు గాని ఢీ కొనటానికి అవకాశము ఏర్పడుతుంది. కెమిస్ట్రీ ఏరకంగానైనా జరగవచ్చు. తదుపరి ప్రతివ్యక్తి పర్సనల్ లైఫ్లోలో చెడు ఆలోచనలకు దారితీసి జీవనసాగరం ఆటుపోటులకు గురి అవుతుంది. పొటాషియం సైనైడ్ తగిలితే మనిషి వెంటనే పోతాడు అంటాం. పోతే అక్కడితో చాప్టర్ క్లోజ్, కాని ఇక్కడ రాసుకు పూసుకు తిరుగుతుంటే మనుషులు పోరు గాని జీవితాలు పోతాయి. అంతగా కెమిస్ట్రీ జరిగిపోతుందంటారా అంటే మూర్ఛ వాడు గిలగిలలాడుతూ కొట్టుకుంటుంటే వాడి చేతిలో తాళంచెవి పెడితే ఏం జరిగిందని వెంటనే లేచి కూర్చుంటున్నాడు. ఇలాంటి సమాజంలో వివాహ వ్యవస్థమీద నమ్మకం సన్నగిల్లదా! మన ఆలోచనలు ఎంత దూరం వెళ్ళిపోతున్నాయి. వివాహ జీవితం గురించి భయపడుతూ అందులో అడుగవేసే పరిస్థితి వచ్చింది. ఆడదానికి మహారాజయోగం అంటే హౌస్ వైఫ్ గా కుటుంబంలో ఆనందంగా జీవించటమే మరి. మనకి సంబంధిత వ్యక్తులు అందరం కలసి ఒకచోట నివసించుటచే ఫలానావారి కుటుంబం అని చెప్పకుంటున్నాము. ఇప్పడు అలాగే ఉంటున్నాము. కాని ఉదయం లేచినప్పటినుంచి వృత్తి ఉద్యోగాదులలో ములిగి సాయంత్రం ఒకచోట ఉన్నప్పటికి హాస్టల్ ఎవరిరూంలో వారు ఉన్నట్లు ఏ అనుభూతి లేకుండా జీవిస్తున్నాము. తల్లి దగ్గర ఉన్నంతసేపు వయసుతో సంబంధములేకుండా మగవాడికి తల్లి పెడితే తినే గుణము ఉంటుంది. వివాహానంతరం భార్య పెడితేనే తినే గుణము ఉంటుంది. ఇది ప్రకృతి సహజ గుణము. వీరిద్దరూ దూరంగా ఉండో, లేదా దగ్గరగా ఉండికూడా పట్టించుకోపోయినట్లయితే వీరికి తినాలనే దృష్టిరాదు. భార్య పెడితే తినే ఆనందం వేరు. ఎవరికి వారు పెట్టుకుని తింటే అదికూడా ఒక అనుభూతేనా? భర్త తెస్తే దాన్నివినియోగించి నడిపించే ఆనందం వేరు. భార్య తెస్తే భర్త తీసుకుని నడిపించే దానినికూడ ఆనందం అంటారా? అందరూ ఎవరికి వారు ఉదయం బయటికి వెళ్ళటం, సాయంత్రం ఇంటికి చేరటం. ప్రస్తుత సమాజంలో ఇదే దినచర్య. నవగ్రహాలకు సంబంధించిన ఈ బంధాలు తల్లి, తండ్రి, భార్య, భర్త, అత్త, మామ, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, పిల్లలు అందరూ కలసి ఒకచోట ఉంటుంటే ఇంత కుటుంబంనుంచి ఆడది బయటకు వెడితే ఆ వ్యక్తికి భోగము ఎక్కడ ఉంటుంది? బంధ బాంధవ్యాలు, మమతానురాగాలు, తీపిగుర్తులు అన్నీ కోల్పోయినట్లే. చివరికి చివరిదశలో ఎవరైనా మాట్లాడతారేమో అని ఎదురు చూడాల్సి వస్తుంది. పిల్లలుతో ఉండదు, భర్తతో ఉండదు,  తల్లిదండ్రులతో ఉండదు, అత్తమామలతో ఉండదు,అన్నదమ్ములతో, బావమరదళ్ళతో ఎవరితోటి అనుబంధము ఉండదు. ఆయాతో గాని, కుక్కుతోగాని, టీవీతోగాని ఉండచ్చు. అవైనా అన్నివిషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి పరిస్థితులలోనే పిల్లలు తల్లిదండ్రుల మాట వినే అవకాశం ఉండదు. ఇట్లాంటి వ్యవస్థలో ఇబ్బందులు పడుతూ సౌఖ్యానికి నోచుకోక భార్యాభర్తల పరిస్థితి నటనా జీవితంగా మారిపోతుంటే రాబోయే తరాల పరిస్థితులు ఏమిటని ఆలోచించకుండా కుజగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది? అని అంటున్నాం. ఇది ఎంతవరకు సమంజసం. అలాగే నూతన వధూవరులకు క్రొత్తలోనే చిన్నచిన్నఇబ్బందులు వస్తే ఒకరు కుజగ్రహ ప్రభావము అంటారు, మరొకరు మరోదోషము ఉంది అంటారు. వేరొకరు అదేంకాదు ముహూర్తదోషము అంటారు. అన్నీ ఎవరికి వారు సొంతంగా ఊహించేసి ఏదోఒకటి మాట్లాడేయటమే. ఏమి చేయలేకపోతే ఇంకొంచెం గిల్లేసి వెళ్లిపోవటమే. పెళ్లి ఎలా జరుగుతోందో ఏ ఒక్కరూ విచారించుటలేదు. పూర్వము శాంతికి పెళ్లి భోజనము అని పెళ్ళైన తర్వాత ఏర్పాటు చేసేవారు. ఇప్పడు ఊరికి ముందర భోజనం. పూర్వం పెళ్ళైన తర్వాతే పూలదండలు మార్చుకునేవారు. ఇప్పుడు ముహూర్తానికి ఒకరోజు ముందరే రిసప్షను, దండలు మార్చుకోవడము, పెళ్ళైన దంపతులలాగానే దర్జాగా కూర్చోవటం, అందరూ ఆశీర్వదించటం ఆ పరిస్థితులలో ఏమని ఆశీర్వదిస్తారో ఏమో ఏమని అక్షితలు వేస్తారో ఏమో, ఎవరికీ తెలియని పరిస్థితి. నాలుగు అక్షింతలు జల్లేసి వచ్చైయటమే. ఇక భోజనం కావచ్చు,మరొకటి కావచ్చు, గ్రహశాంతికి పనికి వచ్చే ద్రవ్యాలు కంటే అశాంతికి సంబంధించిన ద్రవ్యాలు రోజురోజుకి పెరిగి పోతున్నాయి. ఐదురోజుల పెళ్ళి ఐదు గంటలకు దిగింది. ఇప్పుడు ఒకగంటకు పడిపోయింది. నిశ్చితార్థంకు పూర్వము ఒక మాట అనుకునేవారు. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చూపులలోనే ఒకరికి ఒకరు నచ్చారా అని అంటే నచ్చింది అనేమాట విన్నవెంటనే ఇంకేమీ ఆలోచించేవారు కాదు. శుభస్య శీఘ్రం అని సంకల్పం ప్రధానం. చూసినవేళ బాగుంది ఇంతకంటే మంచి సమయం ఏముంది అని అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఆ కొద్ది తమలపాకులు వక్కలు అరటిపండు పెట్టి ఒకరికి ఒకరు నిశ్చయ తాంబూలాలు కానిచ్చేసేవారు. ఆ రోజులలో అందరి ఇళ్లలోను అరటిపండ్లు, తమలపాకులు వాడేవారు. వాటికోసం కూడ అప్పటికప్పుడు బయటకు వెళ్లక్కరలేకుండా పనిఅయిపోయేది. ఆడంబర ఖర్చు లేకుండా పని అయిపోయేది. ఇప్పడు నిశ్చయ తాంబూలాల, మజాకానా అని ఇంచుమించు పెళ్లిలాగానే బాగా ఖర్చు పెంచేసి చేస్తున్నారు. ఉంగరాలు మార్చుకోవచ్చు. సినిమాలకు వెళ్ళచ్చు, ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లచ్చు, రావచ్చు ఉండచ్చు. పద్దతులే మారిపోతున్నాయి. అసలు వివాహ వేడుకలో 33 నుండి 36 తంతులు ఉంటాయి. అవి ఎక్కడైనా జరపనిస్తున్నారా? అందరూ పరిగెత్తేయటమే. ఈ 36 అంశాలలో ఫాటోలు, వీడియోలు ఎక్కడా లేవు. ఇప్పుడు మొత్తం కంట్రోలు అవే చేస్తున్నాయి. పెళ్లి మొదలు పెళ్ళి అయ్యేంత వరకు వధూవురలు ప్రక్కన ఉన్నప్పటికి ఒకరికొకరు చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక డ్యూటీలాగ ఇది అక్కడ పెట్టండి అది ఇక్కడ పెట్టండి అనే పరిస్థితి వచ్చింది. హృదయ స్పందన ఫీల్ లేకుండా పెళ్లి తంతు అయిపోతోంది. పాత సినిమాల్లో పెళ్లితంతులు చూపెట్టేవారు. అది నటన అయినప్పటికి సినిమాతో పాటు ప్రేక్షకులకి కూడా హృదయ స్పందన అనుభూతి కలిగేవి. ఇలాంటి వరిస్థితులలో ఈ విషయాలు ప్రక్కన పెట్టి, ముహూర్త దోషమా, కుజదోషమా, కాలసర్పదోషమా, అని ప్రశ్నలు వేసుకుంటాంటే ఏమనుకోవాలి? దానివల్ల ఏదో అయిపోతుంది అని ఊహించేయటం నిరసించుకోవటం, నీరు కారిపోవటం ఇవి ఎంతవరకు సమంజసం. కాలసర్పదోషం ఒకవ్యక్తికి సంబంధించింది కాదు. ఒకరాజ్యానికి సంబంధించింది, ఒక రాజ్యాధినేతకు సంబంధించింది అని చెప్పబడుతోంది. ఒకవేళ ఆ దోషాలు ఉన్నాయి వాటివల్లే ఇట్లా జరుగుతోంది అని అనుకునే వ్యక్తులు అపోహపడితే ఆ జాతకాలు ఎప్పటికి మారే అవకాశమే ఉండదు. ఎందుకంటే అవి జాతకంలో ఉన్నాయి అంటే అవి పర్మనెంటే కదా. అంచేత గ్రహాల మీద అభాండాలు వేసేకంటే మనమే అసలు గ్రహాలని గుర్తుంచుకుని దంపతులు ఇరువురు నెగ్గినప్పుడు పొగుడుకుంటూ ఓడినప్పుడు ఓదార్చుకుంటూ జీవనం సాగించాలి. భార్యాభర్తలు అసౌఖ్యానికి గురి అయినప్పుడు ఆత్మపరిశీలన చేసికొని దానికి గల కారణాలను అవగాహన చేసికొని సరిదిద్దుకొని ప్రయాణం చేస్తే అంతా ఆనందమే. దానికి తల్లిదండ్రులు, అత్తమామలు నిస్వార్ధంగా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి వాళ్ళ ఊరుకి ముందుగానే గప్ చిప్ గా ఒల్డేజి హొము కు దారి తీసేస్తున్నారు. మరి తీర్చి దిద్దాల్సిన పరిస్థితి వస్తే ఏమిటి అనేది సమాధానము దొరకటంలేదు. ప్రత్యక్షంగా వివాహ వ్యవస్థకు సంబంధించిన అనుకూల, అననుకూల పరిస్థితులని చూస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా అవన్నీ సత్యమని మనకి తెలును. మునిగిపోతున్నామని మనకు తెలుసు. వాటిని మనకు అనుకూలంగా మార్చకునే జ్ఞానం శక్తిమనకు ఉన్నాయి కూడ. అయినప్పటికి మన వ్యవస్థను కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము. అంటే దాని అర్ధం విధి బలీయంగా ఉండి ఎక్కడో సైలెంట్గా మన అందరినికూడ మార్చివేసేస్తోంది. ఇటువంటి పరిస్థితులలో పూజ్యస్వామీజీలు, పీఠాధిపతులు, అనుభవజ్ఞులు, మేథావులు, సైకాలజిస్టులు, ఫిలాసఫర్స్, స్పీకరు, తప్పనిసరిగా కలగచేసుకుని సమాజానికి దారి చూపించవలసిన బాధ్యత ఎంతో ఉంది. లేనట్లయిన ఎదిగిపోతున్నాము అనే మాటకి ఏ రకంగా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితికి రావచ్చు.   
---ఇక్కడ గ్రహాలకు శాంతి చెయ్యి - పైన ఉన్న గ్రహాలు అనుగ్రహిస్తాయి.---    

Related Articles
  •  1.కుజగ్రహము - అనుగ్రహము

    1.కుజగ్రహము - అనుగ్రహము

  • 2. సమాజము - వివాహ వ్యవస్థ

    2. సమాజము - వివాహ వ్యవస్థ

  • 3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

    3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

  • 4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

    4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

  • 5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా

    5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా