• 99857 81915
 • ఉప్పలూరి శేషగిరిరావు,
 • జ్యోతిషనిపుణులు, దుర్గగుడివద్ద, లలితానగర్, రాజమండ్రి - 533 105

Article Detail

6. రత్న ధారణకూ సంశయూలే

6. రత్న ధారణకూ సంశయూలే

ప్రస్తుత సమాజములో ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారివారి విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు, మరి అందరూ తలోరకంగా ధరించమంటుంటే ఏది ఆచరించాలి అనేది రత్నం ధరించేవానికి సందేహంగానే ఉంటుంది. మరి ఎలా? 
 
1. ఒకరు ఇన్మ నక్షత్రాన్ని తెలుసుకాని నక్షత్రాధిపతిని బెట్టి దానికి సంబంధించిన రత్నం ధరించమని చెబుతారు. 
2. మరొకరు జన్మరాశి ఏది అని ఆ రాశ్యాదివతిని బట్టి దానికి సంబంధించిన రత్నం ధరించమని చెబుతారు. 
3. మరొకరు జరుగుతున్న మహా దశానాధుని బట్టి దానికి సంబంధించిన రత్నంను ధరించమని చెబుతారు.
4. మరొకరు జన్మలగ్నాధిపతి దానికి సంబంధించిన రత్నాన్ని ధరించ మంటారు.
5. మరొకరు జన్మించిన తేది, నెల, సంవత్సరములను బట్టికూడా ధరించమంటారు.
6. ఒకాకసారి గోచార చక్రమునందు ఏదైనా పాపగ్రహము సరైన స్థితిలో లేనట్లయిన దాన్ని ఐట్టికూడా ధరించమని చెబుతుంటారు. 
7. మరాకరు అడిగే వ్యక్తి ఎప్పుడు పట్టాడో తెలియదని విన్నవించుకున్నపుడు వారి  నామనస్తత్ర రాశులను ఐట్టి ఆయా ఆధిపతులను బట్టి ధరించమంటారు.
8. మరొకరు ఇప్పడు ఫలానా యోగం జరుగుతోంది కాబట్టి ఫలానాది బాగుంటుంది అని ఆ గ్రహమును గుర్తించి దానికి సంబంధించిన రత్నంను ధరించమంటారు.
            నిజానికి గ్రహ శాంతికనో గ్రహం ఏదో శుభ ఫలితాలను ఇస్తాయనో మనము ధరిస్తూ ఉంటాము. మరి ఇన్నిరకములాగా ధరించే పద్ధతులు ఉన్నప్పుడు ఏప్రకారము ధరించాలి? ఒకాకప్పడు ఈగ్రహం బాగలేదు జపం చేయించండి లేదా ఈ రత్నం పెట్టండి అంటున్నాము.కాని ఆ గ్రహం పిడించాలి అని పూర్వ జన్మ సుక్రుతం వల్ల ఇప్పుదు ఆ వ్యక్థి మిద డ్యూటీకి వచ్చింది అనుకోండి మనమంటే ఒకడ్యూటీ చేయమంటే సంబంధం ఉన్నాలేకపోయినా మరొక డ్యూటీ తగిలించుకొని ఏ మెపుకోసమో చేస్తూ ఉంటాము. మరి గ్రహాలు అలా కాదుకదా, షెడ్యూలు ప్రకారము ధర్మాన్ని ఆచరించి తీరతాయి. మరి అట్లాంటప్పుడు ఆ పాపగ్రహానికి రత్నం ధరిస్తే అగ్నికి అర్ధం పోసినట్లే అయి మరింత బలం పెరిగి చెడు ఫలితాలు కూడా కలుగవచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఇది కదా అని దాని అధిపతి ఈ గ్రహం కదా, ఈ గ్రహం కాబట్టి దీనికి ఈ రత్నం పెట్టండి అనచ్చు కాని ఆ జాతకునికి ఆ జన్మనక్షతాధిపతి స్థితి జాతక చక్రములో బాగోకపోయినట్లయిన అది ధరించటమువలన చెడు ఫలితాలు పొందినను ఆశ్చర్యపోనవసరము లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి? ఎలా ధరించాలి? అని ఆలోచించినట్లయిన మనకి పది మంది స్నేహితులు ఉన్నారనుకుందాము. ఆ పదిమందిలో తామ్మిదిమంది వారివారి పనులలో ఉండవచ్చును. కాని ఒకడు మాత్రము మనలని తరచు వెంటాడుతూ ఉండవచ్చు. ఇంటికి వస్తూ పోతూ ఉండవచ్చు. యోగక్షేమాలు తెలుసుకొనవచ్చు. ఫోనులు చేయవచ్చు. ఒకో రోజు కనిపించకపోయినను మనగురించి మనమేలు గురించి ఆలోచించవచ్చు కనిపించనవెంటే ఎంతో ఆర్థతతో ఎక్కడికి వెళ్లావ ఈవారం అసలు కనిపించలేడు ఖంగారు పడ్డాను చెప్పవచ్చును కదా ఏదైనా అవసరమయితే నేను ఉన్నాను కదా. నన్ను పిలు అని ఎంతో ప్రేమతో విలపిస్తాడు. ఆ స్నేహితుడినే క్లోస్ ఫెండ్, చైల్డ్హుడ్ ఫెండ్ అంటున్నాము. అంటే ఆ వ్యక్తికి మనం కనిపించినను కనిపించకపోయినను మనము ఎప్పడూ బాగుండాలని కోరుకుంటున్నారన్న మాట. మిగతా వారు వారి వారి వ్యవహారాదులలో వారు ఉంటే ఉండవచ్చును కదా. అలాగే ఒక వ్యక్తి జన్మ సమయాన్ని బట్టి ఏఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికి గ్రహ కుటుంబమునందు ఏదో ఒక గ్రహం వల్ల ఎల్లవేళల యందు ఎనీ టైం మేలు చేసేదిగా శుభం చేకూర్చేదిగా ఉంటుంది. ఆ గ్రహం లగ్నాధిపతా. ధర్మాధిపతా, కుటుంబాధిపతా, కళత్రస్థానాధిపతా, లాభాధిపతా లేక మరొకటి  ఏదైనప్పటికి ఏగ్రహమైనప్పటికి దానిని పరిశీలించి విశ్లేషించి ఆగ్రహానికి సంబంధించిన రత్నంను ధరించినచో ఎంతోకొంత మేలు జరిగే అవకాశము ఉంటుంది.
 
  రత్నధారణవిధానము :
1.రవి :  కెంపు - బంగారముతో కుడిచేతి ఉంగరపవేలికి ధరించాలి 
2.చంద్ర : ముత్యము - వెండితో కుడిచేతి చూపడవేలికి ధరించాలి.
3.కుజ : పగడము - రాగితో కుడిచేతి ఉంగరవవేలికి ధరించాలి.
4.బుధ : వచ్చ-వెండితో కుడిచేతి చిటికెనవేలికి ధరించాలి.
5.గురు : పుష్యరాగము - బంగారముతో కుడి చూపడవేలికి ధరించాలి.
6.శుక్ర : వజ్రం - బంగారముతో ఎడమచేతి చూపడవేలికి ధరించాలి.
7.శని : నీలం - వెండితో ఎడమచేతి మధ్యవేలికి ధరించాలి.
8.రాహు : గోమేధికం -సత్తులోహంతో కుడిచేతి మధ్యవేలికి ధరించాలి.
9.కేతు : వైఢూర్యం - పంచలోహములతో ఎడమచేతి చిటికెనవేలికి ధరించాలి.
 
---ఇక్కడ గ్రహాలకు శాంతి చెయ్యి - పైన ఉన్న గ్రహాలు అనుగ్రహిస్తాయి.---

Related Articles
 • 1.కుజగ్రహము - అనుగ్రహము

  1.కుజగ్రహము - అనుగ్రహము

 • 2. సమాజము - వివాహ వ్యవస్థ

  2. సమాజము - వివాహ వ్యవస్థ

 • 3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

  3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

 • 4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

  4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

 • 5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా

  5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా