• 99857 81915
 • ఉప్పలూరి శేషగిరిరావు,
 • జ్యోతిషనిపుణులు, దుర్గగుడివద్ద, లలితానగర్, రాజమండ్రి - 533 105

Article Detail

8. ఎంత గొప్పవాడు ఏలినాటి శని

8. ఎంత గొప్పవాడు ఏలినాటి శని

ఎవరినొట విన్నా 'కొపం మంచాడురా శనిగాడు' అంటుంటారు. లేదా అయిదు సంవత్సరములనుంచి పడేబాధలు ఏమి చెప్పమంటారు. ఆరోగ్యం కృంగిపోయింది, ఆర్ధికంగా అంటావా ఆపరేషనుకు రెండు లక్షలు అయ్యాయి. ఇంతలో పకింటివాడు ఇప్పుడు ఎలా ఉంది అంటే బ్రతికి బయట పడ్డానులేరా ఫరవాలేదు, డబ్బుకూడ కొంత ఆరోగ్యశ్రీలో ఇచ్చారనుకో. ఇంకేమిటి మరి బాగానే ఉందికదా అంటాడు పక్కింటివాడు. అసలు కలియుగంలో ఎవరైతే నామీద దృష్టిపెట్టి తపనని తాను ధర్మమార్గములో నిర్వర్తించుకుంటూ ఉంటారో వారిజోలికి నువ్వ వెళ్ళరాదు అని ఆభగవంతుడే కలిని ఆజ్ఞాపించినాడు. అయినప్పటికి మనం ఇబ్బందులు పడుతున్నాము అంటే మనము ఎక్కడో గాడి తప్పతున్నాము అన్నమాట. ఆయన మాట తప్పడుకదా. అలాంటపుడు శని వాటిని సరిదిద్దటానికి వస్తాడన్నమాట. అయినా ఆ శని ఇబ్బందులు పెట్టేకంటే మేలే ఎక్కువ చేస్తున్నాడు. మనము బండి కాన్నామనుకోండి. ఆరునెలలు తర్వాత ఏమి చేస్తాము? సర్వీసుకు ఇస్తాము. ఎందుకని దాని లైఫ్ టైం ఎక్కువగా ఉండడముకోసము. మనం ఎక్కువ కాలము ఉండాలంటే ఆ శనిదే బాధ్యత. ఆయుర్ధాయకారకః శనిః. మన జీవిత కాలములో మూడునుంచి నాలుగు సార్లు మనల్ని సర్వీసింగ్ చెయడనికి శని వస్తాడనమాట.తలదగ్గర నుండి పాదాలు దాకా వెళ్లటానికి ఏడున్నర సంవత్సరములు సమయము పడుతుంది. బండి సర్వీసింగ్ కు ఇచ్చినప్పడు ఎకడైనా ఏదైనా సరిగా లేనట్లయిన దానిని సుత్తితో కాట్టటము, నట్లు, బోల్టులు గట్టిగా బిగించటము ఇంకా తేడాగా ఉన్నట్లయితే కాల్చి మరమ్మత్తు చేయటము చేస్తున్నాము కదా. అలాగే మన పరిస్థితిని బట్టి బిళ్లలు, ఇంజక్షన్లు, టానిక్లు, లేదా ఆపరేషన్లు తప్పటలేదు. శని ఎంత  గొప్పవవాడంటే మనం తప్పచేస్తే శిక్షించటలేదు. అయ్యో ఈ బిడ్డకు ఆరోగ్య పరిస్థితి ఇలా అయిపోయిందేమిటిరా అనుకొని ప్రేమతో మనవద్దకు వచ్చి బాగుచేయటానికి మాత్రమే ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. ఈయన ఒకడికి సర్వీసింగ్ మొదలు పెట్టాడు. తలనుంచి నెమ్మదిగా ప్పొట్టదాకా వచ్చాడు. ఆ వ్యక్తి ప్పొట్ట చాలా చెత్తచెత్తగా ఉందని గమనించాడు.క్లీన్ చేయటం మొదలు పెట్టాడు. అప్పుడు మొదలయింది ఆ వ్యక్తికి కడుపనాప్పి మంట వగైరా. అంటే ఆయన క్లీన్ చేయటం మొదలు పెట్టిన తరువాత జబ్బు బయట పడినది. అంతకు ముందు లోపల దాక్కుని ఉన్నది. ఇప్పడు అది ఆపరేషనుకు దారితీసినది. ఇంకేముంది డాక్టరు వచ్చారు ఆపరేషను సక్సస్ అన్నారు. ఇక్కడ గమనించాల్సినది మనము అడ్డమైన తిళ్ళు తిని ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నాము. అది గమనించిన శని వైద్యోనారాయణో హరిః అని డాక్టరు అనే భగవంతుని వద్దకు తీసుకువెళ్ళి మన ఆరోగ్యాన్ని పరిరక్షించి మరికొంతకాలము బ్రతికేటట్లు చేస్తున్నాడన్నమాట. ఆ శని రాకుండా ఉన్నట్లయితే ఆ పాట్ట పరిస్థితి ఏమిటి? అది మురిగి ఢాం అంటాము. అంటే ఇప్పడు ఈ కడుపునొప్పి లేక మంట వగైరాలు శని తెచ్చిపెట్టాడా? లేక మనము ఏం తినాలో తెలియక కనిపించినవన్ని తినివేసి బాధలు కొని తెచ్చుకొని ఆయన తెచ్చిపెట్టాడనుట ఎంతవరకు సమంజసము? ఒకొక్కసారి చూడండి. రాత్రి వాడితో మాట్లాడానురా ప్రోడ్డుటే మాయమయిపోయాడరా అంటుంటాం. అంటే ఆ వ్యక్తికి జాతక చక్రంలో శని బలము తేడాగా ఉంది అన్నమాట. శనికి కూడా అంతుపట్టలేని చెత్త తిన్నాడన్నమాట. ప్రతిమనిషి తను తినే తిండిని బట్టి ఆరోగ్యము, ప్రవర్తన, ఆధ్యాత్మికచింతన, భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి అనటానికి సందేహమే లేదు. శని వస్తే జబ్బు రాలేదు. మనలొ దాగి వున్న జబ్బుని అయన బయటకు లాగారు. మనకి మేలు కొలుపు చేసడన్నమాట. అప్పుడు వైద్యము చేయించుకున్నాము, ఔషధ శాంతి జరుపుకుని బయట పడ్డాము. ఆయన రాకపోతే మన పరిస్థితి ఏమిటి? శని అందరికి ఆయన ప్రేమను వంచుతాడు, దానధర్మాలు చేయిస్తాడు. వృత్తి ఉద్యోగాడులు ఇస్తాడు. ఆయుర్ధాయమునకు మూల కారకుడు. ఇతరులకు ఆపదలో సేవలు చేస్తాడు. సహాయము చేస్తాడు, పెళ్లిళ్ళుకూడా చేయిస్తాడు, గుణపాఠాలు నేర్చుతాడు. న్యాయ బద్దమైన జీవితాన్ని నడిపిస్తాడు. ఫైనల్గా స్థిరత్వాన్ని ఇచ్చేదికూడా ఆయన మాత్రమే. అంత గాప్పవాడన్నమాట ఏలినాటి శని.
 
         టీనేజిలో ఉన్నవారికి గ్రహగతులు సరిలేనట్లయిన లవ్ ఎఫైర్స్, వ్యామోహాలకు గురి అయ్యే అవకాశము ఉంటుంది. జాగ్రత్తగా మసలుకోవాలి. పారపాటున వ్యామోపాంలో పడినట్లయిన మొదటిగా 1.డ్యూటీ మిస్ అవతాము, 2.కాలము (టైం) మిస్ అవతాము, 3.ధనము ఖర్చయిపోతుంది, 4.దగ్గర మనుషులతో రిలేషన్స్ మిస్ అవతాము, 5. భవిష్యత్తుకు గ్రోత్ పడిపోతుంది, 6.ఉద్రేకాలకు లోనవుతాము, 7.చివరిగా ఏమి సాధించామో తెలియని పరిస్థితి ఏర్పడవచ్చు మేల్ అండ్ ఫిమేల్ వరస వాయి లేకండా వైబ్రేషన్స్ ఎప్పడు ఎలా మారుతాయో చెప్పలేము. వ్యామోహానికి  స్త్రీ,పరుష బేధము ఉండదు. అందువల్లనే పూర్వము కట్టుబాట్లు, సాంప్రదాయము, ఆచారములు నిర్ణయించారు. పాతకాలపు పద్దతులు, ఆ కట్టుబాట్లు ఈ కాలములో ఏమిటి అనుకున్నట్లయితే ఈ వ్యవస్థ మారే అవకాశము ఉండకపోవచ్చు. అటువంటపుడు పారపాటున జరగకూడని పరిస్థితులు జరిగినట్లయిన ఇతరులను కారణంగా చూపట సమంజసము కాదు.
 
---ఇక్కడ గ్రహాలకు శాంతి చెయ్యి - పైన ఉన్న గ్రహాలు అనుగ్రహిస్తాయి.---

Related Articles
 • 1.కుజగ్రహము - అనుగ్రహము

  1.కుజగ్రహము - అనుగ్రహము

 • 2. సమాజము - వివాహ వ్యవస్థ

  2. సమాజము - వివాహ వ్యవస్థ

 • 3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

  3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

 • 4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

  4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

 • 5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా

  5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా