• 99857 81915
 • ఉప్పలూరి శేషగిరిరావు,
 • జ్యోతిషనిపుణులు, దుర్గగుడివద్ద, లలితానగర్, రాజమండ్రి - 533 105

Service Detail

ముహూర్తములు

ముహూర్తములు

బాలసారి(నామకరణము):  సోమ, బుధ, గురు, శుక్రవారములు 2, 3, 5, 7, 10, 13, 15 తిధులు - అశ్విని, ਠੀ పునర్వసు, పుష్యమి, ఉత్తరాత్రయం, మఘ, హస్త, అనూరాధ, శతభిషం నక్షత్రములు, వృష. మిధున, కర్కాటక, కన్య తుల, ధనూ, మీన లగ్నాలు, అష్టమ శుద్ధి, వక్షచిద్రము కాని రోజు మంచిది. పురిదీ శుద్ధి అనంతరం 11, 21, 29 రోజులు లేదా 3వ నెలయందు బాలసారి చేయు రోజున నామకరణం చేయుట మంచిది.
 
అస్త్రప్రాశసకు:  మగ - (6, 8, 10, 12) సరి, ఆడ - (7, 9, 11) బేసిమాసములందు పగలు పూర్యాహ్నము లోపల చేయవలెను.
సోమ, బుధ, గురు, శుక్రవారములు అశ్వి ਠ, మృగ, పున, పుష్య ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూ, శ్రవ, ధని, శత, రేవతి నక్షత్రములు, వృష, మిధు, కర్కా కన్య ధనుః, మీన లగ్నములు మంచివి. లగ్నశుద్ధి, దశమశుద్ధి తప్పనిసరిగా చూడవలెను.
 
అక్షరాభ్యాసము: సోమ, బుధ, గురు, శుక్రవారములు, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, తిథులు, అశ్వి, పున, పుష్య హస్త, చిత్త, స్వాతి, అనూ, శ్రవ, రేవతి నక్షత్రము ex, మేష్కకర్కాటక, తుల, మకరలగ్నాలు మంచివి. అష్టమ శుద్ధి చూడాలి. బిడ్డకు 5వ సంl ములో ఉత్తరాయణమందు మూఢమి లేని రోజులలో జరిపించవలెను.
 
ఉపనయనము:  సోమ, బుధ, గురు, శుక్రవారములు, అనాధ్యాయరహితమైన 2, 3, 5, 7, 10, కృష్ణపక్షమున 2, 3 తిథులు, అశ్వి, రోహి, మృగ, పున, పుష్య ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూ, శ్రవ, ధని, శత, రేవతి కారలు, వృష. మిధు, కర్కా, కన్య ధనూ, మీన లగ్నాలు మంచివి. అష్టమ శుద్ధి, చంద్రబలం, తల్లిదండ్రులకు తారాబలం ప్రధానం. ఉత్తరాయణంలో చేయవలెను. లగ్నానికి కేంద్రంలో పాపులు, చతుర్థంలో రవిగాని ఉండరాదు.
 
నిశ్చయతాంబూలమునకు: ఉభయపక్షములందునూ విదియ, వంచమి, సప్తమి, దశమి తిథులు. శుక్లపక్షమునందు ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు. ఆది, బుధ, గురు, శని వారములందును, అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనూ, శ్రవణ, ధనిష్ట, శతభిష నక్షత్రములందు, లగ్నమునకు 5-9 స్థానాలందు పావ గ్రహములు లేనపుడు నిశ్చయ కాంబూ లాలు పుచ్చుకోవలెను.
 
వివాహమునకు శుభసమయములు: ఉభయ పక్షములయందునూ, విదియ, తదియ, వం చమి, సప్తమి, దశమి, శుక్లపక్షమునందు త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, కృష్ణపక్ష పాడ్యమి తిథు లు, బుధ, గురు, శుక్రవారాలు మంచివి. రోహిణి, మృగశిర, మఖ, ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూరాధ, మూల, రేవతీ నక్షత్రములు. వృషభ, మిధున, కర్కాటక, కన్య తుల, ధను, మీనలగ్నాలు మంచివి. మిగిలిన లగ్నములు మంచివి కావు.
సప్తమం (7) గ్రహ వర్ణితమై మండవలెను. అష్టమశుద్ధి ప్రధానము. చంద్రుడు 6, 8, 12 స్థానాలలోను, ఏ గ్రహముతోనూ కలిసి వుండకూడదు. రవి మీనంలో వుండగా వచ్చిన చైత్రమాసమునందు చేయరాదు.
 
గృహప్రవేశం: బుధ, గురు, శుక్రవారాలు 2, 3, 5, 7, 10, 11, 13, 15 తిథులు, ಹ್ಹಾ. మృగ, ఉత్తరాత్రయం, చిత్త అనూ, ధని, శత, రేవతీ నక్షతాలు, వృష, మిధున, కన్య ధను, మీనలగ్నాలు మంచివి. స్థిరలగ్నం అయినా చాలా మంచిది. చతుర్ధ, అష్టమ శుద్ధి. వృషభకలశ శుద్దులు చూడవలెను.
 
వుంచవన, శీమంతములు: 2, 3, 5, 7, 10, 13, 15 తిథులు. బుధ, గురు, శుక్ర వారములు, రోహి. హస్త, చిత్త, స్వా, వన, పుష్య ఉత్తరాత్రయం, అనూ, శ్రవ, ధని, రేవతి నక్షత్రములు. మేష, మిధు, తుల, ధనూ, కుంభలగ్నములు మంచివి.
గాజులు: గర్భం ధరించిన బేసినెలలు 5 లేక 7 నెలలయందు పెట్టవలెను.
 
ఉద్యోగములో చేరుటకు:  బుధ, గురు, శుక్రవారములు, 2, 3, 5, 7, 10, 11, 13 తిథులు, అశ్వి వున, పుష్య హస్త, చిత్త, అనూ, రేవతీ నక్షత్రములు మంచివి. రవి, కుజులు 10.11 స్థానములలో ఉండగాను, శుభలగ్నాల్లో చేరవలెను.

Related Articles
 • 1.కుజగ్రహము - అనుగ్రహము

  1.కుజగ్రహము - అనుగ్రహము

 • 2. సమాజము - వివాహ వ్యవస్థ

  2. సమాజము - వివాహ వ్యవస్థ

 • 3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

  3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

 • 4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

  4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

 • 5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా

  5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా