• 99857 81915
 • ఉప్పలూరి శేషగిరిరావు,
 • జ్యోతిషనిపుణులు, దుర్గగుడివద్ద, లలితానగర్, రాజమండ్రి - 533 105

Service Detail

జప శాంతులు

జప శాంతులు

నవగ్రహములవలన కలుగువ్యాధులు - శాంతులు
 
రవ్యాది నవగ్రహములు గోచారరీత్యాగాని లేక జాతకరీత్యాగాని వారియొక్క దశ, అంతర్జ శలయందు దుష్టస్థానములయందున్నపుడు ఆయా గ్రహములకు ఈ క్రింద తెలిపిన ప్రకారము
ఆయా రోగములు సంభవించును. ఆ సమయములో అద్దీ గ్రహములకు తగిన శాంతులు జరి గించిన ఆరోగ్యము, మనశ్శాంతి కలుగును.
 
1. రవి:  కందీకి సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, సన్నిపాతం, పైత్యవికారములు, క్షయ, పౌ డిదగ్గు, అతిసారము, శరీర అవయవములలో ఎడమ పార్యమునకు నొపులు, గుండెకు సంబం ధించిన బాధలు, చర్మ సంబంధమైన వ్యాధులు కలుగును. రవి ప్రీతికి 1kg గోధుమలు ఆదివారము దానము ఇవ్వవలెను. రవికి 6 వేలు జపము, ఈశ్వరాభిషేకము చేయించవలెను. జాతి కెంపు ఉంగరములో ధరించవలెను.
 
2. చంద్రుడు:  శ్వాసకోశసంబంధమైన వ్యాధులు, ఆయానము, దగ్గు, కంఠము, పొట్ట, కుడి భాగమునందున్న అవయవములు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, బొల్లి, పాండు రోగము, క్షయ, బోద, అండరోగములు, కామెర్ల, మూత్రకోశ సంబంధమైన వ్యాధులు, జలో దరము మొదలగునవి కలుగును. 
        చంద్రప్రీతికి 1kg బియ్యం సోమవారము దానము ఇవ్వవలెను. చంద్రునికి 10వేలు జపము చేయించవలెను. జాతి ముత్యము ఉంగరములో ధరించవలెను.
 
3.కజుడు:  చర్మ సంబంధమైన వ్యాధులు, దురదలు, కురుపులు, కండ్ల జబ్బలు, నులి పురుగు లు, కన్ను ముక్క చెవి, పన్ను (Teeth) మొదలగువాదీవలన బాధలు, మూత్ర సంబంధమైన బాధలు, గిలక, అండములు, వాచుట, శూల, కుపు, కపము, ఎముకలకు సంబంధించి బాధ లు, నోరు, గొంతుక మొదలగువాదీయందు కురుపులు, అరుచి కలుగును. వాహన ప్రమాదము ులు,ఎముకలు విరుగుట, ఎనుప పనిముట్లవలన గాయములు, శస్త్రభయం, కర్ర, కత్తి మొదలగు వాదీవలన దెబ్బలు తగులుట, ಎತ್ತಿವೆ. స్థలమునుండి జారిపడుట జరుగును. కుజ ప్రీతికి 1kg కందులుగాని, కందివవుగాని మంగళవారం దానం ఇవ్వవలెను. కుజునకు 7వేలు జపము, సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకము చేయించవలెను. జాతి పగడము ఉంగరములో ధరించవలెను.
 
4. బుధుడు:  నపుంసకత్వము, చర్మవా ్యధులు, ఉదర సంబంధమైన వ్యాధులు, పొత్తికడుపు వద్ద బాధలు, మూలశంఖ, పైత్యగ్రహణి, వాతరోగం, శ్లేష్మరోగ సంబంధమైన వ్యాధులు, చర్మరోగము లు, మాటలు సరిగా రాకపోవుట, కుపు, పాండు, నాలుక సంబంధించిన బాధలు, నోరు అరుచిగా యుండును.
బుధప్రీతికి 1kg పెసలు బుధవారం దానం యివ్వవలెను. విష్ణు సహస్రనామాలు పారాయణ చెయ్యవలెను. బుధునకు 17వేలు జపం చేయించవలెను. జాతివచ్చ ఉంగరములో ధరించవలెను.
 
5. గరుడు:  భుద్దికి సంబంధించిన బాధలు, మందత్వము, జ్ఞాపకశక్తి తగ్గుట, మెదడు, ఊపిరి తిత్తులు, పేగులకు సంబంధించిన వ్యాధులు, శ్లేష్మం, పైత్యవికారములు, గుల్మరోగములు, చంచల మనస్సు ఉదరసంబంధమైన బాధలు.
గురు ప్రీతికి 1kg శనగలు గురువారం దానం యివ్వవలెను. గురునకు 16వేలు జవం చేయించవలెను. నమక పారాయణ చేయించవలెను. కనక పుష్యరాగము లేక పుష్యరాగముఉంగరములో ధరించవలెను.
 
6. శుక్రుడు:  మూత్రసంబంధమైన వ్యాధులు, జననేంద్రియ, గుప్తరోగములు, మధుమేహ రోగములు, ముక్కకి సంబంధించిన బాధలు, పైత్య వికారములు, కడుపునొప్పి, సుఖవ్యాధులు, అతిమూత్ర రోగములు కలుగును. శుక్ర ప్రీతికి 1kg బొబ్బర్లు శుక్రవారం దానం యివ్వవలెను. శుక్రునకు 20వేలు జవం చేయించవలెను. ప్రతి శుక్రవారము మహలక్ష్మీపూజ చేయుచుండవలెను. జాతివజ్రము ఉంగ రములో ధరించవలెను.
 
7. శని: నరముల బలహీనత, కాలేయమునకు సంబంధించిన రోగములు, గుల్మరోగమబులు, సంధి, ఇంద్రియ నష్టం, మనశ్చాంచల్యము, విశాచభయం, పక్షవాతం,కుడి ప్రక్క చెవినొప్పి మొ| నవి, వాత సంబంధమైన నొప్పలు. శనిప్రీతికి నువ్వులు శనివారం దానం యివ్వవలెను. శనికి 19 వేలు జపము చేయించ వలెను. ప్రతినిత్యము శివప్రార్థనలు, శనిస్తోత్రములు చదువుచుండవలెను. ఏలినాదీశని దోషమనగా శని 12, 1,2 రాశులయందు సంచరించు కాలము. ఈ దోష ము 7సం||ల 6 నెలలు యుండును. శనిత్రయోదశిరోజున మందవల్లిలో శనికి తైలాభిషేకము చేయించవలెను.
 
8. రాహువు: అపస్మారము, భూత పేత విశాచ బాధలు, మూలశంఖ, ఉబ్బస వ్యాధులు, శూల, రక్తదోషములు, మతిభ్రమణం, కందీకి సంబంధించిన వ్యాధులు, విషజంతుభయం, విషప్రయో గములు, పైశాచిక ప్రవర్తన (Sadism) కలిగించును.
  రాహుప్రీతికి 1kg మినుములు శనివారం దానం యివ్వవలెను. రాహువుకు 18వేలు జపం చేయించవలెను. దుర్గాపూజ (అమ్మవారికి) కుంకుమపూజ) చేయించుచుండవలెను. జాతిగోమేధికము ఉంగరములో ధరించవలెను.
  
9.కేతువు:  గజ్జి, కురువులు, నీరసం, కాళ్లకు, చేతులకు దురదలు, తిమ్మెర్లు, విషజంతుభయం, శరీర రుగ్మతలు, నిస్సత్తువ, అనాయాస మరణము, అవమృత్యుభయం కలిగించును. 
కేతుప్రీతికి 1kg ఉలవలు మంగళవారం దానము యివ్వవలెను. కేతువుకు 7 వేల జపము చేయించవలెను. సూర్యప్రార్థనలు, సూర్య నమస్కారములు చేయించవలెను. జాతి వైఢూర్యము (పిల్లికన్నురాయి) ఉంగరములో ధరించవలెను

Related Articles
 • 1.కుజగ్రహము - అనుగ్రహము

  1.కుజగ్రహము - అనుగ్రహము

 • 2. సమాజము - వివాహ వ్యవస్థ

  2. సమాజము - వివాహ వ్యవస్థ

 • 3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

  3. సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

 • 4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

  4. పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

 • 5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా

  5. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము సమంజసమా