9.ఇక్కడ మనకు ఉన్నవే - స్వర్గము, నరకము
తోటి మనిషితో ఎట్లా ప్రవర్తించాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటము, ఇంటికి వచ్చిన అతిథులతో గౌరవించుకొనటము, మంచి సాంప్రదాయ సంస్కారములతో బ్రతుకు వెళ్లబుచ్చటము, ఇతరులకి ఇష్టములేని పని చేయకుండటము, మనము చేసే పని ఇతరులకు ఇబ్బందిలేకుండా వుండే జీవనము ఎంచుకొనుట, నిత్య దేవతార్చన చేసికొనుట, మానవ సేవయే మాధవ సేవ అనునట్లు ఇతరులకు సంఘానికి ఉపయోగ పడుట, అందరిని సమతత్త్వముతో చూసుకొనుచు జీవన సాగరము సాగించు వారికి స్వర్గము ఎప్పుడు దగ్గరే. నరకము అసలు కనిపించదు. అసలు స్వర్గము అంటే ఏమిటి? ఉన్నతమైన కుటుంబములో పుట్టుట, మనకు కావలసిన సౌఖ్యములు అవసరములు సమయానికి అందుట, మంచి విద్యను అభ్యసించుట, దురలవాట్లు లేకుండుట, కుటుంబములో కొరత లేకుండుట, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్లు, తల్లిదండ్రులు, మేనత్త మేనమామలు, అమ్మమ్మ, బామ్మ, తాతలు అంటే నవగ్రహ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరు మన ఇంటిలో ఉండుట, సమయానికి విద్యాభ్యాసము అగుట, సమయానికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులను అందుకొనుట, సమయానికి వివాహము అగుట, జీవన సాగరములో ఏ ఇబ్బందులు, ఆపదలు లేకుండా భోగభాగ్యములు కలిగి సేవా కార్యక్రమములోను భగవతారాధనలోను, పాల్గొనుట అనేదే స్వర్గము. ఇతరులకు ఇబ్బంది కలగకుండా జీవించువాడు మానవుడు. ఇతరులకు మేలు చేయువాడు మాధవుడు అట్లు కానివాడు రాక్షసుడు. ముగ్గురము మనమే. కాలమే భగవంతుడు. ఈ కాలమునందు ధర్మాన్ని పాటించాలి. అసలు ధర్మమంటే ఏమిటి? స్వధర్మమేమిటి? కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? సంఘంలో ఎలా ఉండాలి? వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో ఎలా ప్రవర్తించాలి? ఫైనల్గా ఒక బాధ్యత. కాలంలో పనికి తాపత్రయ పడకుండా షెడ్యూలు ప్రకారం పని ఉండి పని ఎగవేసి ఖాళీగా ఉండి కష్టపడకుండా జేబులు నింపుకోవాలనే వాంఛ ఉన్న ప్రతివారికి నరకము దగ్గరగానే ఉంటుంది. లేదా చక్కగా నరకములోనే ఉండవచ్చుకూడా. అలాగే మనకి అన్ని ఉండి ఏ అవసరము లేకపోయినప్పటికి ఉచిత సాయము కోసము ఎదురు చూచుట, లేదా ఉచిత సాయము పొందినను వృత్తి ఉద్యోగ వ్యాపారాదులను పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడ వచ్చు. తద్వారా నరక యాతన పడతామనుటలో సందేహము లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి హోదాగల, బాధ్యతగల ఉద్యోగమునందు రాణించుచున్నాడు. ఏ ఇతర అవసరములు అతనికి లేవు. అయినప్పటికి తనవద్దకు పనినిమిత్తము వచ్చిన వ్యక్తిదగ్గరనుంచి ఏదో ద్రవ్యము ఆశించుటచే తదనుగుణముగా ఆ ద్రవ్యము తనచేతిలోనికి వచ్చుటచే దురద్రుష్ట వశాత్తు తను నిర్వర్తించిన తీరుపై పైవారికి తెలిసి టోటలుగా ఉన్న ఉద్యోగమును విరమించుకొనవలసి వచ్చినది. తద్వారా నరక యాతనలోకి నెట్టివేయబడినాడు. అసలు నరకమంటే ఏమిటి? చిన్నప్పుడే తల్లి లేదా తండ్రిని కోల్పోవుట, సద్గురువును ఆశ్రయించక లేదా విశ్వశించకపోవుట, తను నివసించు ప్రాంతమునందు నగర పరిపాలన సరిగా లేకుండుట, అన్నపానీయాదులకు దూరమగుట, బ్రతుకు తెరువుకు దారి దొరక్కపోవుట, చేయని నేరాన్ని అంగీకరించుట, మానభంగములు జరుగుట, స్పోర్ట్స్ బైక్ మీద ఆనందంగా విహరిస్తూ వంకరటింకర ప్రయాణములలో పిల్లలకు ఏక్సిడెంట్ అయి అంగ వైకల్యము కలుగుటచే తల్లిదండ్రులు పడే క్షోభ, పిల్లలు విద్య, వృత్తి ఉద్యోగాదులకు నోచుకొనకుండుట, అభివృద్ధికి రాలేకపోవుట, ఇతరత్ర విషయములందు ఆసక్తి చూపుట, సమయానికి పిల్లలకు వివాహము జరుగకుండుట, ఋణములు పెరిగి తీర్చుటకు సాధ్యపడకపోవుట అనే పరిస్థితులే నరకము. భగవంతుని ఆరాధించలేదనో, గుడికి వెళ్లలేదనో ఈ నరకము అంటదు. తన ధర్మాన్ని ఆచరించకపోవుట వల్ల ఏర్పడుతుంది. కాలమే భగవంతుడు. పనియే భగవంతుడు. కాలములో తనపనికి తాను తాపత్రయ పడి కాలాన్ని వృధా చేయకుండా విధి నిర్వహణలో వినయ విధేయతలతో జీవన మొనరించినచో నరకానికి తావే లేదు. అంతా స్వర్గమయమే. పుట్టుట, పెరుగుట, పోవుట ఈ లక్షణాలు సకల ప్రాణుల సహజము. కొన్ని ప్రాణులు తాము బ్రతుకుతూ మరికొన్నిటిని బ్రతికిస్తూంటాయి. అమూల్యమైన సందేశాలను కూడ ఇస్తాయి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిందంటూ భారీ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. పిచ్చుకకు ఏ టెక్నాలజీ ఉందని తీగకు అపార్ట్మెంట్స్ కట్టుకొనుచున్నది. ఎంత కృషి, పశు పక్ష్యాదులు, వృక్షములు మంచిచెడులతో సంబంధము లేకుండా ఏదో ఒక విధమైన మేలు చేస్తుంటే వాటిని చూసి మనము నేర్చుకునే పరిస్థితులలోనే ఉన్నాము (టెక్నాలజీ కాదు, జ్ఞానము). విజ్ఞానవంతుడైన మానవుడు స్వార్థపూరిత జీవనాలు వదిలి ఎంత ఆదర్శంగా ఉండవలెను. తను బ్రతుకుతూ ఇతరులను బ్రతకనీయాలి. అదే మానవ ధర్మం. తద్వారా సమాజ అభివృద్ధి ఏర్పడుతుంది.
6.రత్న ధారణకు సంశయాలే
6.రత్న ధారణకు సంశయాలే ప్రస్తుత సమాజములో ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారివారి విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు. మరి అందరూ తలోరకంగా ధరించమంటుంటే ఏది ఆచరించాలి అనేది రత్నం ధరించేవానికి సందేహంగానే ఉంటుంది.
7.ముహూర్తమునకు గ్రహగతులే ముఖ్యమా!
7.ముహూర్తమునకు గ్రహగతులే ముఖ్యమా! మనము ఏ కార్యానికైతే ముహూర్తాన్ని నిర్ణయిద్దామని అనుకుంటామో అంటే అక్షరాభ్యాసమా, ఉపనయనమా, వివాహమా, వ్యాపారమా, గ్రుహప్రవేశమా ఏమైనా కావచ్చు ఒకొక్క కార్యానికి ముహుర్త భాగములో ఒకొక్క భావము పర్టిక్యులర్గా శుద్ధిగా
9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము
9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము తోటి మనిషితో ఎట్లా ప్రవర్తించాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటము, ఇంటికి వచ్చిన అతిథులతో గౌరవించుకొనటము, మంచి సాంప్రదాయ సంస్కారములతో బ్రతుకు వెళ్లబుచ్చటము, ఇతరులకి ఇష్టములేని పని