8.ఎంత గొప్పవాడు ఏలినాటి శని

ఎవరినోట విన్నా ‘కొంప ముంచాడురా శనిగాడు’ అంటుంటారు. లేదా అయిదు సంవత్సరములనుంచి పడే బాధలు ఏమి చెప్పమంటారు. ఆరోగ్యం కృంగిపోయింది, ఆర్ధికంగా అంటావా ఆపరేషనుకు రెండు లక్షలు అయ్యాయి. ఇంతలో పక్కింటివాడు ఇప్పుడు ఎలా ఉంది అంటే బ్రతికి బయట పడ్డానులేరా ఫరవాలేదు, డబ్బుకూడ కొంత ఆరోగ్యశ్రీలో ఇచ్చారనుకో. ఇంకేమిటి మరి బాగానే ఉందికదా అంటాడు పక్కింటివాడు. అసలు కలియుగంలో ఎవరైతే నామీద దృష్టిపెట్టి తనపని తాను ధర్మమార్గములో నిర్వర్తించుకుంటూ ఉంటారో వారిజోలికి నువ్వు వెళ్లరాదు అని ఆ భగవంతుడే కలిని ఆజ్ఞాపించినాడు. అయినప్పటికి మనం ఇబ్బందులు పడుతున్నాము అంటే మనము ఎక్కడో గాడి తప్పుతున్నాము అన్నమాట. ఆయన మాట తప్పడుకదా. అలాంటప్పుడు శని వాటిని సరిదిద్దటానికి వస్తాడన్నమాట. అయినా ఆ శని ఇబ్బందులు పెట్టేకంటే మేలే ఎక్కువ చేస్తున్నాడు. మనము బండి కొన్నామనుకోండి. ఆరునెలలు తర్వాత ఏమి చేస్తాము? సర్వీసుకు ఇస్తాము. ఎందుకని దాని లైఫ్ఎం ఎక్కువగా ఉండడముకోసము. మనం ఎక్కువ కాలము ఉండాలంటే ఆ శనిదే బాధ్యత. ఆయుర్దాయకారకః శనిః. మన జీవిత కాలములో మూడునుంచి నాలుగు సార్లు మనల్ని సర్వీసింగ్లు చేయడానికి శని వస్తాడన్న మాట. తలదగ్గరనుంచి పాదాలుదాకా వెళ్లటానికి ఏడున్నర సంవత్సరములు సమయము పడుతుంది. బండి సర్వీసింగ్కు ఇచ్చినప్పుడు ఎక్కడైనా ఏదైనా సరిగా లేనట్లయిన దానిని సుత్తితో కొట్టటము, నట్లు, బోల్టులు గట్టిగా బిగించటము ఇంకా తేడాగా ఉన్నట్లయితే కాల్చి మరమ్మత్తు చేయటము చేస్తున్నాము కదా. అలాగే మన పరిస్థితిని బట్టి బిళ్లలు, ఇంజక్షన్లు, టానిక్లు, లేదా ఆపరేషన్లు తప్పుటలేదు. శని ఎంతగొప్పవాడంటే మనం తప్పుచేస్తే శిక్షించటలేదు. అయ్యో ఈ బిడ్డకు ఆరోగ్యపరిస్థితి ఇలా అయిపోయిందేమిటిరా అనుకొని ప్రేమతో మనవద్దకు వచ్చి బాగుచేయటానికి మాత్రమే ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. ఈయన ఒకడికి సర్వీసింగ్ మొదలు పెట్టాడు. తలనుంచి నెమ్మదిగా పొట్టదాకా వచ్చాడు. ఆ వ్యక్తి పొట్ట చాలా చెత్తచెత్తగా ఉందని గమనించాడు. క్లీన్ చేయటం మొదలు పెట్టాడు. అప్పుడు మొదలయింది ఆ వ్యక్తికి కడుపునొప్పి మంట వగైరా. అంటే ఆయన క్లీన్ చేయటం మొదలు పెట్టిన తరువాత జబ్బు బయట పడినది. అంతకు ముందు లోపల దాక్కుని ఉన్నది. ఇప్పుడు అది ఆపరేషనుకు దారితీసినది. ఇంకేముంది డాక్టరు వచ్చారు ఆపరేషను సక్సస్ అన్నారు. ఇక్కడ గమనించాల్సినది మనము అడ్డమైన తిళ్లు తిని ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నాము. అది గమనించిన శని వైద్యోనారాయణో హరిః అని డాక్టరు అనే భగవంతుని వద్దకు తీసుకువెళ్ళి మన ఆరోగ్యాన్ని పరిరక్షించి మరికొంతకాలము బ్రతికేటట్లు చేస్తున్నాడన్న మాట. ఆ శని రాకుండా ఉన్నట్లయితే ఆ పొట్ట పరిస్థితి ఏమిటి? అది మురిగి ఢాం అంటాము. అంటే ఇప్పుడు ఈ కడుపునొప్పి లేక మంట వగైరాలు శని తెచ్చిపెట్టాడా? లేక మనము ఏం తినాలో తెలియక కనిపించినవన్ని తినివేసి బాధలు కొని తెచ్చుకొని ఆయన తెచ్చిపెట్టాడనుట ఎంతవరకు సమంజసము? ఒకొక్కసారి చూడండి, రాత్రి వాడితో మాట్లాడానురా ప్రోద్దుటే మాయమయిపోయాడురా అంటుంటాం. అంటే ఆ వ్యక్తికి జాతక చక్రంలో శని బలము తేడాగా ఉంది అన్నమాట. శనికి కూడా అంతుపట్టలేని చెత్త తిన్నాడన్న మాట. ప్రతిమనిషి తను తినే తిండిని బట్టి ఆరోగ్యము, ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి అనటానికి సందేహమే లేదు. శని వస్తే జబ్బు రాలేదు. మనలో దాగివున్న జబ్బుని ఆయన బయటకు లాగారు. మనకి మేలు కొలుపు చేశాడన్న మాట. అప్పుడు వైద్యము చేయించుకున్నాము, ఔషధ శాంతి జరుపుకుని బయట పడ్డాము. ఆయన రాకపోతే మన పరిస్థితి ఏమిటి? శని అందరికి ఆయన ప్రేమను పంచుతాడు, దానధర్మాలు చేయిస్తాడు. వృత్తి ఉద్యోగాదులు ఇస్తాడు. ఆయుర్దాయమునకు మూల కారకుడు. ఇతరులకు ఆపదలో సేవలు చేస్తాడు. సహాయము చేస్తాడు, పెళ్లిళ్లుకూడా చేయిస్తాడు, గుణపాఠాలు నేర్పుతాడు. న్యాయ బద్దమైన జీవితాన్ని నడిపిస్తాడు. ఫైనల్గా స్థిరత్వాన్ని ఇచ్చేదికూడా ఆయన మాత్రమే. అంత గొప్పవాడన్నమాట ఏలినాటి శని. టీనేజిలో ఉన్నవారికి గ్రహగతులు సరిలేనట్లయిన లవ్ ఎఫైర్స్, వ్యామోహాలకు గురి అయ్యే అవకాశము ఉంటుంది. జాగ్రత్తగా మసలుకోవాలి. పొరపాటున వ్యామోహంలో పడినట్లయిన మొదటిగా 1. డ్యూటీ మిస్ అవుతాము, 2. కాలము (టైం) మిస్ అవుతాము, 3.ధనము ఖర్చయిపోతుంది, 4. దగ్గర మనుషులతో రిలేషన్స్ మిస్ అవుతాము, 5. భవిష్యత్తుకు గ్రోత్ పడిపోతుంది, 6. ఉద్రేకాలకు లోనవుతాము, 7. చివరిగా ఏమి సాధించామో తెలియని పరిస్థితి ఏర్పడవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ వరస వాయి లేకండా వైబ్రేషన్స్ ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేము. వ్యామోహానికి స్త్రీ, పురుష బేధము ఉండదు. అందువల్లనే పూర్వము కట్టుబాట్లు, సాంప్రదాయము, ఆచారములు నిర్ణయించారు. పాతకాలపు పద్ధతులు, ఆ కట్టుబాట్లు ఈ కాలములో ఏమిటి అనుకున్నట్లయితే ఈ వ్యవస్థ మారే అవకాశము ఉండకపోవచ్చు. అటువంటప్పుడు పొరపాటున జరగకూడని పరిస్థితులు జరిగినట్లయిన ఇతరులను కారణంగా చూపుట సమంజసము కాదు.

6.రత్న ధారణకు సంశయాలే

6.రత్న ధారణకు సంశయాలే ప్రస్తుత సమాజములో ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారివారి విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు. మరి అందరూ తలోరకంగా ధరించమంటుంటే ఏది ఆచరించాలి అనేది రత్నం ధరించేవానికి సందేహంగానే ఉంటుంది.

Read More »

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా సంతానము అంటే వెంటనే మొత్తం కుజగ్రహానికి లింకు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమోఅర్థంకావటంలేదు. నిజానికి కుజుడు ప్రస్తుత సమాజంలోపూర్తిచైతన్యవంతంగానే నడిపిస్తున్నాడు. పది సంవత్సరములు నిండని కుర్రవాడు ఆపోజిట్ సెక్సుతో  స్నేహం

Read More »

7.ముహూర్తమునకు గ్రహగతులే ముఖ్యమా!

7.ముహూర్తమునకు గ్రహగతులే ముఖ్యమా! మనము ఏ కార్యానికైతే ముహూర్తాన్ని నిర్ణయిద్దామని అనుకుంటామో అంటే అక్షరాభ్యాసమా, ఉపనయనమా, వివాహమా, వ్యాపారమా, గ్రుహప్రవేశమా ఏమైనా కావచ్చు ఒకొక్క కార్యానికి ముహుర్త భాగములో ఒకొక్క భావము పర్టిక్యులర్గా శుద్ధిగా

Read More »