11.దేవాలయమున అర్చకుడు – భక్తుడు

భగవంతునికి – భక్తునికి మధ్య అనుసంధానమే దీక్ష పొందిన అర్చకుడు. అర్చకుని సంస్కారమువల్ల అర్చనలో విశిష్టత వల్ల ప్రతిమా రూపమువల్ల ఆలయములో భగవంతుడు సన్నిహితుడు అవుతాడు. శిల్పి చెక్కిన శిలా విగ్రహాన్ని దేవునిగా రూపొందించటము అర్చకుని చేతిలో ఉంటుంది. అర్చకుడు తన గుణమువలన, నడవడివల్ల అర్చన విధులను నిర్వహణలో చూపే శ్రద్ధవల్ల మాత్రమే ప్రతిమలో దైవతత్వాన్ని సాధిస్తాడు. దేవాలయము ప్రజలందరికి చెందిన వ్యవస్థ. కావున దైవ సంబంధిత విషయాలు లౌకికమైన విషయాలు ఆ వ్యవస్థలో ఉండుట సహజము. ఆలయ నిర్మాణమును సంరక్షించుట అవసరమైనప్పుడు మరమత్తులు చేయించుట ఆలయ ఆస్థులను కాపాడుట ఆదాయ వ్యయములను సక్రమముగా నిర్వహించుట ఆలయ సిబ్బందిని నడిపించుట ఉత్సవాలను నిర్వహించుట సమాజంలో సత్సంబంధాలను సాధించుట లౌకికమైన అంశాలు అన్ని ధర్మకర్తలు లేదా పాలక మండలి నిర్వర్తించుట జరుగుతుంది. ఆలయంలో నిత్య దేవతార్చన పవిత్ర కార్యము. దీనికి లౌకికమైన పరిమితులు ఉండవు. ఈ కార్యాన్ని నిర్వహించేది ప్రధానముగా అర్చకుడు మాత్రమే. అతడు పరిపాలకుల ద్వారాగాని కార్యనిర్వాహక సంఘం ద్వారా కాని వేతనముమీద నియమించ బడడు. అతను అర్చక వంశమునుంచి వచ్చినవాడు. పుట్టుకకు ముందే తండ్రిద్వారా లేదా ఆ కుటుంబంలోని పెద్దల ద్వారా సంస్కారము పొందినవాడు. పూజా విధానములో పరిచయము ఉన్నవాడు. ఆలయము, దైవ ప్రతిమ, అర్చకుడు ఈ మూడు సమిష్టిగానే ఆలయ నిర్వాహక సంఘానికి సంక్రమిస్తాయి. అర్చకత్వము అనేది వంశపారంపర్యంగా మాత్రమే వస్తుంది. ఇతరులు నియమించేది కాదు. గర్భాలయములోనికి అర్చకుడు తప్ప ధర్మకర్తలైనప్పటికీ పాలక మండలైనప్పటికి ఎవరికి వారు ప్రవేశించటము సాంప్రదాయము కాదు. నిషిద్దము. అలాగే ఎట్టిపరిస్థితులలోను అర్చక కుటుంబము తప్ప బయట భక్తులనుంచి ఎటువంటి వంటకాలను ఇతరత్ర ఏఏ పదార్ధాలైనప్పటికిని భగవంతునికి నివేదించరాదు. అలా చేసిన అర్చకునికి దేవతా ప్రతిమకి కళ తప్పే అవకాశము ఉంటుంది. ప్రతిరోజు మనకి ఎవరో ఒకరు ఏదోఒకటి తెచ్చిపెడుతుంటే మనం అవి రోజు తినటం మొదలుపెడితే కొంతకాలానికి ఆరోగ్యం చెడినట్లుగానే దోషము దేవాలయమునకు కూడా ఉండును. ధాన్యాదులు మనకు ఎక్కడనుంచి వచ్చినను వండిపెట్టే మాత ఒకరే అయినప్పుడు ఆరోగ్యము ఆయువు బాగుగనే ఉంటాయి. అందుచే భక్తులు భగవంతుని నివేదన కొరకు ప్రసాద వితరణ కొరకు ధనరూపేణ ఇవ్వచ్చు కాని ఆలయములో పెడతానంటే అది సాంప్రదాయము కాదు. అది వారివారి ఇళ్లలో దేవతార్చన సమయమున నివేదించుకొనుట వల్ల భక్తునికి శుభప్రదము జయప్రదము. అర్చకుని ప్రభావమువలనే శిల దేవతారూపము దాలుస్తుంది. అర్చకుడు తన వృత్తిలో ఉపదేశము దీక్ష పొంది ఉండాలని తన శాఖకు చెందిన శాస్త్ర విషయాలలో సరియైన అవగాహన కలిగి ఉండాలనేది ఆగమ నిర్దేశము. అతడు దైవత్వంలో తాదాత్మ్యం చెందకపోతే భక్తునికి భగవంతునికి మధ్య అతని అనుసంధానము ఫలవంతము కాదు. అర్చకుడు విద్వాంసుడు ఉపాధ్యాయుడు కానక్కరలేదు. ఉపదేశ దీక్షా సమయములోనే అతనికి శాస్త్ర శిక్షణ జరుగుతుంది. విద్వత్ కలిగి ఉండటం కంటే దైవం మీద అచంచల భక్తివల్ల తాను చేపట్టిన వృత్తిమీద అభినివేశమువల్ల అర్చకుడు విశిష్ఠుడౌతాడు. ఒక ఆలయం ప్రసిద్ధికి వచ్చిందంటే అందుకు వాస్తుకాని ప్రదేశముకాని శిల్పవైచిత్రి కాని కారణము అనుకోరాదు. అర్చకామూర్తిలో దైవత్వం నెలకొనడం అనేది అది మూర్తీభవించడానికి ప్రధాన కారణము సద్వర్తనులు అయిన అర్చకులు నిత్యము 3 నుంచి 6 సార్లు క్రమ పద్ధతిలో నిరంతరాయంగా లోపరహితంగా అర్చనలు చేయటమే. ఆలయ సంస్కృతిలో అర్చకునికి అంత ప్రాధాన్యత ఉంది. ఆలయ నిర్వాహణలు అలా చేయటంవలనే దేశముయొక్క భద్రత సంపద క్షేమము ఆధారపడి ఉంటాయి. అందుచే అర్చకుని క్షేమంకూడా చాలా ముఖ్యము. అర్చకుడు కష్టదశలో ఉన్నప్పుడు లేదా పేదరికములో ఉన్నను ఆలయ అర్చకులకు విఘాతము కలుగకుండా చూడాలి. లేనట్లయిన ప్రతిమలో దైవత్వానికి కూడా విఘాతము కలుగుతుంది. అందుచేతనే అర్చకునికి ప్రధానక్షేత్రములలో ఆలయ నిర్వాహకులు ఆలయానికి దగ్గరలో వసతి కల్పించుటయే కాకుండా కుటుంబముతో నిశ్చింతగా సుఖంగా జీవించేందుకు తగిన ఏర్పాటులు గావించబడి వుండటం చూస్తుంటాము. ఆలయంలో సర్వవిధులు సక్రమముగా జరుగుతున్నాయో లేదో పరిశీలన అర్చనాది కార్యములు అర్చకుని నియోగము ప్రకారమే జరగాలి. అతడే కార్యనిర్వాహకుడు, ధర్మ రక్షకుడు. శాస్త్ర చోదితములైన ఉపచార విధులు అర్చక సహాయకులు పరిచారకులు నిర్వర్తించెదరు. ప్రతి దశలోను అర్చకుడే మార్గదర్శి. భక్తులు దేవాలయ ప్రాంగణంలో చెప్పులతో తిరుగరాదు, ప్రదక్షిణానంతరము దేవాలయంలో ప్రవేశించాలి, ప్రదక్షిణానికి ముందుగానే దైవమును ప్రార్థించుకోవాలి, ప్రదక్షిణ సమయంలో తప్ప మిగతా సమయములందు ధ్వజస్థంబ విమాన గోపుర ప్రాకార చ్ఛాయలను దాటరాదు, యజ్ఞోపవీతమును సవ్యముగా ఉంచుకొని శుచిగా మంచి దుస్తులతో ఆలయంలో ప్రవేశించాలి, ఇతరత్రా వస్తువులను చేతపట్టికాని సాంప్రదాయదుస్తులు కానివి వేసుకుని గాని ఆలయంలో ప్రవేశించరాదు, తిలక ధారణ ఉండాలి, ఉపహారాదులు సేవిస్తూ ప్రవేశించరాదు, ప్రసాదము తినకుండా పారవేయరాదు, తిని శేషించిన దానిని అక్కడ విడువరాదు, మల వాయు విసర్జన చేయరాదు, దీర్ఘరోగములు ఉన్నవారు కూడా ప్రవేశించరాదు, కాళ్లు చాపుకొని కూర్చొనుట, నిద్రపోవుట, కుర్చీలలో కూర్చోనుట ఆలయ ప్రాంగణములో పనికిరాదు ఆలయములో రోదన పనికి రాదు. రోదిస్తూ స్తుతిస్తు దర్శనమునకు పోరాదు మనస్సు పవిత్రము కాదు, ఏ ప్రాణికి దుఃఖము కలిగించకుండా ఆలయంలో ప్రవేశించవలెను, వ్యర్థ ప్రసంగాలు గట్టిగా మాట్లాడుట బిగ్గరగా స్వరము విప్పి ప్రార్థించుట చేయరాదు, ఆలయములో సత్యమును దాచి అసత్యమును డాంబికముగా ప్రదర్శించరాదు, సంబంధము కాని శాస్త్రార్థ చర్చలు చేయరాదు, ఇతరులతో వివాదము పెట్టుకొనరాదు, అహంకారంతోను తనను బాగుగనే పొగుడుకొనే వ్యక్తి దైవమును గురుజనులను లెక్కచేయకుండా వుండే వ్యక్తులు ఆలయమున ప్రవేశించరాదు, ఎంత సంపన్నుడైనను తనకంటే పెద్దవారితోగాని పండితునితో గాని నీవు అని సంబోధించరాదు, దేవాలయమునందు ఎంతవారినైనప్పటికిని నమస్కరించరాదు, ప్రణామములు చేయరాదు, ఆలయములో దేవునికి పృష్ట భాగము చూపిస్తూ కూర్చొనరాదు, ఒక ప్రక్కగా ఉండి ఆలయమునుంచి నిష్క్రమించాలి, వేళకాని వేళలయందు ఆలయ ప్రవేశము చేయరాదు, అహంకారంతో తలుపులు తీయించరాదు, గురువునందు మానుష భావము, దైవమునందు శిలా భావము మంత్రమునందు జీవిక భావము అర్చకుల పట్ల, అర్చనల పట్ల నీరస భావము కల వ్యక్తి ఆలయ ప్రవేశము చేయరాదు, వారు సర్వదా నిందా పాత్రులు, వారి జీవితము నిష్ఫలము, నిర్మలమైన చిత్తము కలవాడు మాత్రమే సర్వకర్మలకు అర్హుడు, అగ్నికార్యము, జపము, స్నానము, తపస్సు, స్వాధ్యాయము, వీటిని సోమరితనము లేకుండా నిత్యము ప్రాతఃకాలమునే లేచి విధి ప్రకారము స్నానము చేసి సమాహితమైన మనసుతో ఆయా కర్మలద్వారా భక్తుడు పరమాత్మను పూజించవలెను.

8.ఎంత గొప్పవాడు ఏలినాటి శని

8.ఎంత గొప్పవాడు ఏలినాటి శని ఎవరినోట విన్నా ‘కొంప ముంచాడురా శనిగాడు’ అంటుంటారు. లేదా అయిదు సంవత్సరములనుంచి పడే బాధలు ఏమి చెప్పమంటారు. ఆరోగ్యం కృంగిపోయింది, ఆర్ధికంగా అంటావా ఆపరేషనుకు రెండు లక్షలు అయ్యాయి.

Read More »

2.సమాజము – వివాహ వ్యవస్థ

2.సమాజము – వివాహ వ్యవస్థ చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది సమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృహస్థాశ్రమము  వినా మరో మార్గాంతరము లేదు.

Read More »

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా సంతానము అంటే వెంటనే మొత్తం కుజగ్రహానికి లింకు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమోఅర్థంకావటంలేదు. నిజానికి కుజుడు ప్రస్తుత సమాజంలోపూర్తిచైతన్యవంతంగానే నడిపిస్తున్నాడు. పది సంవత్సరములు నిండని కుర్రవాడు ఆపోజిట్ సెక్సుతో  స్నేహం

Read More »