5.నక్షత్రాన్ని బట్టీ పేరు పెట్టడము సమంజసమా

అక్కడ హాస్పటల్లో డెలివరీ ఇక్కడ ఈ నక్షత్రానికి మా మనవడికి ఏం పేరు పెడితే బాగుంటుంది అంటారు? అంటే పుట్టిన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని పెద్దవారి భావన. కాని వారెవరో అలా పెట్టారండి అందుకని అంటాడు ఆ పెద్దాయన. అసలు నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాలనే పద్దతి ఎంతవరకు సమంజసము. పూర్వకాలములో అందరూ వారి పెద్దవాళ్ళ పేర్లు తాత, అమ్మమ్మ, బామ్మలు, మావయ్యలు పేర్లకు భగవంతుని నామాన్ని కలుపుకునిbమంచి స్వరమున్న అక్షరాలుతో పేర్లు పెట్టుకునే వారు. వారందరూ చక్కటి జీవితాలుvగడిపారు. మరి ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జన్మ నక్షత్రం తెలుసుకొని దాన్ని బట్టి పేర్లు పెట్టటము చేయుచున్నారు. జీవితాలు బాగుంటున్నాయా, అంటే ఏమీ చేయలేము. ఒకడు చదవడు, ఒకడు చెయ్యద్దన్న పని చేస్తాడు, ఒకడు తల్లిదండ్రులను ఏడిపిస్తాడు, మరొకడు సంబంధంలేని వాళ్లని ప్రేమిస్తాడు. మరి ఏమిటి దీని గొప్పదనము. పూర్వం ఏమీ చూడకుండా పేర్లు పెట్టుకునేవారు బాగుగానే ఉన్నారు. ఇప్పుడు ఏమిటో తెలియకుండా ఇదేదో పద్దతి ఉంది వారు పెట్టుకున్నారు కదా వారి మనవడికి, మనముకూడా అదే ఫాలో అవుదాము అని చేస్తే పరిస్థితులు ఇలా మారుతున్నాయి. ఇదంతా ఎక్కడినుంచి వస్తోంది సాంప్రదాయము అర్ధము కావటంలేదు. లేదా పేర్లు మార్చివేసుకోవటము ఉన్న తాతగారి పేరు మార్చుకోవట మేమిటి? తాతగారు జమిందారీగా బ్రతిగారు కదా, ఊరందరికి తెలుసునుకదా. మరెందుకు ఆయన పేరు మార్చుకోవటము. ఎంతవరకు సమంజసము.
అసలు విషయానికి వస్తే ఒకవ్యక్తి జాతకము చెప్పించుకుందామని పెద్దాయన దగ్గరకి వెళ్లాడు, అడిగాడు. ఆయన డేటు, టైము, ప్లేసు అడిగారు. ఇతను ఏమీ లేవు అన్నాడు. జన్మ నక్షత్రము తెలుసా అని పెద్దాయన మరల అడిగారు. అదీ లేదు అన్నాడు. అసలు నక్షత్రము ఎందుకు? డేటు టైము ఎలాగూ లేవు కనుక జాతక చక్రము వేసి మాట్లాడే అవకాశము లేదు. కనుక కనీసం జన్మ నక్షత్రం ఉంటే రాశి వశాత్తు ఇప్పుడు ఉన్న గోచార పరిస్థితి ఎంతో కొంత తెలుసుకొని సమాచారము చెప్పవచ్చునని పెద్దాయన భావన. మరి నక్షత్రము కూడా తెలియదన్నాడు కనుక నీ పేరు ఏమిటని అడిగారు. ఏదో పేరు చెప్పటము ఆ పేరుకు తగినట్లు పేరును బట్టి నీది ఫలానా నక్షత్రము అవుతుంది. ఇక ముందు పంచాగమునందు గోచార ఫలితాలు ఫలానా నక్షత్రము ఉండే రాశి. ఈ రాశిని బట్టి చూసుకోవాలని చెప్పారు. ఇది నీ నామ నక్షత్రమని తెలియపరచారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి జాతకచక్రము లేనట్లయిన వారికి ఎంతో కొంత ఉపశమనము కొరకు పేరు అడిగి నామ నక్షత్రాన్ని పేరులో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రాన్ని తెలుసుకొని రీడింగ్స్ చెప్పుట కొరకు జరుగుతోంది. ఇది కేవలము గోచారము రాశి ఫలితాలు వరకు మాత్రమే. జీవిత జాతక ఫలితాలు మాత్రము కాదు. మరి ఇప్పుడు మనము మాట్లాడేది జన్మ నక్షత్రము తీసికొని పేరు ఏమి పెట్టాలి అని అడుగుతున్నాము. ఈ పద్ధతి ఎంతవరకు సమంజసము అనిపిస్తోంది. ప్రతి వ్యక్తి తెలిసిన తెలియకపోయిన జన్మ నక్షత్రము ఒకటి, పేరుపెట్టుకున్నప్పుడు పేరును బట్టి నామనక్షత్రము మరొకటి ఈ రెండు నక్షత్రాలు తప్పనిసరిగా ఉంటాయి. రాశి ఫలితాలు లేదా గోచార ఫలితాలు తెలుసుకుందాము అనేవారికి జన్మ నక్షత్రము తెలియకపోతే వారి నామ నక్షత్రాన్ని బట్టి పరిస్థితులు అంచనా వేస్తారు. ప్రతి వ్యక్తికి జన్మ నక్షత్రాన్ని బట్టి చంద్రవశాత్తు ఒక చక్రము ఉంటుంది. అలాగే నామనక్షత్రాన్ని బట్టి చంద్రవశాత్తు మరొక చక్రము ఉంటుంది. ఈ రెండు చక్రాలు వేరు వేరుగానే ఉంటాయి. అలా ఉంటేనే మనకి మంచిది. జన్మ నక్షత్ర వశాత్తు గోచారఫలితాలు బాగోకపోయినట్లయిన నామ నక్షత్ర వశాత్తు గోచార ఫలితాలు బాగుండవచ్చు కదా. ఒకవేళ నామనక్షత్ర వశాత్తు గోచార ఫలితాలు బాగోకపోయినట్లయిన జన్మ నక్షత్రవశాత్ గోచార ఫలితాలు బాగుండవచ్చు కదా. దీనివల్ల ఏమి అర్థమవుతోంది. ఆ వ్యక్తికి ఏదో ఒక చక్రం మంచిగా బేలన్స్ చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏమి చేస్తున్నాము? జన్మ నక్షత్రానికి నామ నక్షత్ర టేబుల్ని తీసుకుని అందులో ఉండే అక్షరాలని గమనించి జన్మ నక్షత్రానికి పేరు పెట్టేస్తున్నాము. అదే మా మనవడి పేరు అంటున్నాము. ఇప్పుడు ఏమవుతోంది? జన్మ నక్షత్రము ఎలాగో ఉంది. నామ నక్షత్రము కూడా మనము చేసిన పనికి అదే అవుతోంది. అంటే గోచారము బాగున్నా బాగోకపోయినా ఒకే సారి అప్ లేదా డౌన్ వస్తాయి. అంటే నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టటంవలన ప్రయోజనం వుందో లేదో ఆలోచించుకోవాలి. ఏమీ ఉండకపోగా మనకు తగ్గట్టుగా మంచి పేర్లను సెలక్టు చేసుకునే అవకాశాన్నికూడా పూర్తిగా మిస్ అవుతున్నాము. నక్షత్రాన్ని బట్టి ఒకోసారి అక్షరం సరిగా లేక ఏమి పేరు పెట్టాలో తెలియక ఆ అక్షరం మీద తల తోక లేని పేర్లనుకూడా పెట్టుకోవటం జరుగుతోంది. ఇది ఎంతవరకు సమంజసము? స్వర్గీయ యన్.టి. రామారావుగారిది పెద్ద కుటుంబము. వారి ఇంట్లో అమ్మాయిలు అందరికి అమ్మవారి పేర్లు అబ్బాయిలందరికి కృష్ణుడు పేర్లు జోడించి పెట్టడం జరిగింది. నామకరణ విషయంలో ఆయనిది ఎంత గొప్ప ఆలోచన. అందుచేత పుట్టబోయే పిల్లలకు పెద్దవారితో ఆలోచించి వారి వంశీకుల పేర్లకు భగవన్నామాన్ని తోడు చేసికొని మంచి స్వరమున్న అక్షరాన్ని వాడుకొని ఏ పేరు పెట్టుకున్నప్పటికి వారు ఆయురారోగ్య ఐశ్వర్యములతోనే ఉంటారు. దాంపత్యము, కృషి, భూమి, దేశము, యుద్ధము, వర్తకము, గృహము, పురము, గ్రామము, మంత్రము, గురువు, ప్రభువు, దేవత మొదలగు వాటికి అర్వణములు చూచునపుడు మాత్రము నామనక్షత్రమును నామరాశియును ప్రధానముగా ఆచరించుట సంప్రదాయము.

2.సమాజము – వివాహ వ్యవస్థ

2.సమాజము – వివాహ వ్యవస్థ చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది సమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృహస్థాశ్రమము  వినా మరో మార్గాంతరము లేదు.

Read More »

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము తోటి మనిషితో ఎట్లా ప్రవర్తించాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటము, ఇంటికి వచ్చిన అతిథులతో గౌరవించుకొనటము, మంచి సాంప్రదాయ సంస్కారములతో బ్రతుకు వెళ్లబుచ్చటము, ఇతరులకి ఇష్టములేని పని

Read More »

10.నిత్య దేవతార్చనచే – ప్రశాంత జీవనం

10.నిత్య దేవతార్చనచే – ప్రశాంత జీవనం వైదికము, సనాతనము, ధర్మశాస్త్రము అనుసరించి స్వధర్మ ఆచరణ చేయుటయే భగవంతుని ఆరాధన. మనకి ఉన్న దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణములను నిత్య కర్మలను ఆచరించుటద్వారా

Read More »