14.పతి వ్రతముచే – స్త్రీ ఆదిశక్తి

స్త్రీ తమ భర్తని పరమేశ్వరునిగా భావించాలి. విసుగులేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా దానధర్మాలు చేయరాదు. ఇరుగుపొరుగు ఇళ్లకు తరచు వెళ్లరాదు. తప్పనిసరి అయినపుడు ఇంట్లో మరొక మనిషితో వెళ్లి పని చూసుకు రావాలి. ఒంటరిగా ఎచటికి ఎప్పుడూ వెళ్లరాదు. దుష్టప్రవర్తన గల స్త్రీలతో స్నేహం చేయరాదు. భర్త బయట నుంచి రాగానే సంతోషంగా ఎదురేగి స్వాగతించి అలసట తీరువరకు సేదతీర్చాలి. అతని ఇష్టాన్ని అనుసరించి ఆరోగ్యకరమైన ప్రీతికరమైన భోజనము పెట్టి తదుపరి తను భుజించాలి. భర్త నిద్రించిన తరువాతనే తను నిద్రపోవాలి. అతను నిద్ర మేల్కొనగానే అవసరమైన ఉపచారములు చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని భర్తకు పూజాద్రవ్యాలు స్వయంగానే సమకూర్చి పెట్టాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంగా ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండరాదు. భర్త కోపగించుకొనే పరిస్థితి తెచ్చుకొనరాదు. ఒకవేళ పరిస్థితి వచ్చినను శాంత పరచుకొనవలెను, మాటలను మనసులో ఉంచుకొనరాదు. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాదులు, ఉపవాసాలు చేయరాదు. తీర్థ యాత్రలకు వెళ్లరాదు. ఆయన ఆజ్ఞను అనుసరించి మాత్రమే భార్య నడుచుకోవలెను. భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి. మాంగళ్యాభివృద్ధికి పసుపు కుంకుమ మంగళ సూత్రాలు భక్తితో ధరించాలి. ఉమ్మడి కుటుంబమునుంచి వేరుపడుటకు ప్రయత్నించరాదు. శ్రీమంతులను చూచి భర్తను తేలిక భావముతో చూడరాదు. భర్త ఏ పరిస్థితులలో ఉన్నప్పటికిని (వృత్తి, హోదా) అతనిని పరమేశ్వరునిగానే భావించాలి. స్త్రీ యథేచ్ఛగా సంచరిస్తే తన పుణ్యము నశించి నరకానికి దారితీస్తుంది. మరొక పతివ్రత పాదధూళితో గాని వారి పాపము నశించదు. పతివ్రతలవలన వంశాభివృద్ధి, పురుషార్థాలు వివాహమాడిన భాగ్యశీలికి సిద్ధిస్తాయి. ఆమెలేక యజ్ఞయాగ ధర్మాలు ఫలంకావు. అట్లాంటి స్త్రీవల్లే సత్సంతానము, ఊర్థ్వలోకాలు లభిస్తాయి. గంగాస్నానమువల్ల వచ్చే పుణ్యం పతివ్రతను దర్శించటమువలన కూడా కలుగుతుంది అనుటలో సందేహము లేదు. అటువంటి పతి వ్రతముచే స్త్రీ దేవతాశక్తిగా, ఆదిశక్తిగా పిలువబడుతోంది. పతివ్రత ఇంట శాంతి నెలకొని ఉంటుంది. అందరూ తమతమ ధర్మములు నిర్వర్తించేవారుగా ఉంటారు. ఆమె గుణములు ప్రభావము ఇరుగుపొరుగువారిమీద కూడ పడుతుంది. చిన్నతనంలో కుటుంబములో మంచి శిక్షణ, మంచి సాంగత్యము లభించటంద్వారా ధార్మిక భావాల ప్రాబల్యం ఏర్పడి వివాహానంతరము చక్కటి పాతివ్రత్యంతో స్త్రీ నడుచుకొనగలదు. తమ ధర్మాన్ని ఆచరించడానికి అందరికి స్వతంత్రము ఉంటుంది. పతివ్రతా ధర్మాన్ని ఆచరించుటకు కాలమేమి అడ్డంకి కాదు.

4.పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

4.పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా ప్రస్తుత సమాజములో పంచాగమునందు చూపబడిన వధూవర గుణమేళన చక్రప్రకారము ఎవరికి వారు చూసుకుని 18 పాయింట్లు తగ్గితే వచ్చిన సంబంధం వదులుకుని 18 పాయింట్సుకి పెరిగితే వారే కన్ఫార్మ్

Read More »

1.కుజగ్రహము-అనుగ్రహము

1.కుజగ్రహము-అనుగ్రహము ప్రస్తుత సమాజమున వయసు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు ఒక జ్యోతిష్కుని కలిసిన వెంటనే వారికి ఉండే సందేహము మొదటిగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏమైనా కుజదోషము ఉందా? అనే

Read More »

6.రత్న ధారణకు సంశయాలే

6.రత్న ధారణకు సంశయాలే ప్రస్తుత సమాజములో ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారివారి విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు. మరి అందరూ తలోరకంగా ధరించమంటుంటే ఏది ఆచరించాలి అనేది రత్నం ధరించేవానికి సందేహంగానే ఉంటుంది.

Read More »