4.పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా
ప్రస్తుత సమాజములో పంచాగమునందు చూపబడిన వధూవర గుణమేళన చక్రప్రకారము ఎవరికి వారు చూసుకుని 18 పాయింట్లు తగ్గితే వచ్చిన సంబంధం వదులుకుని 18 పాయింట్సుకి పెరిగితే వారే కన్ఫార్మ్ చేసుకొనటము జరుగుతోంది. అనుభవంలో 18 కన్నా తగ్గినవారు ఆనందంగా ఉండడం చూస్తున్నాము. అలాగే 18 పాయింట్లు కన్నా పెరిగినవారు ఇబ్బందులు పడటము చూస్తున్నాము. ఒకవ్యక్తి యం.టెక్ చదివి 100% మార్కులు పొంది ఒక కాంట్రాక్టరు దగ్గర అసిస్టెంటుగా పనిచేసేవారు ఉన్నారు. అదే మరొక వ్యక్తి సాధారణ మార్కులతో ఐటిఐ పాసయ్యి కార్పొరేట్ సంస్థలలో చీఫ్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. అంటే ఇచ్చట మార్కులు ప్రధానము కావటంలేదు. దమ్ము సత్తా ఎంత ఉంది అనేది ముఖ్యం. అది జాతక చక్రం మీద ఆధారపడి ఉంటుంది అని తెలుస్తోంది. గుణమేళన చక్రం చిన్న ఆబ్జెక్టివ్ టైప్బి ట్పేపరులాంటిది అని అనుకోవచ్చు. జాతక చక్రము మెయిన్ పేపరు లాంటిది. ఈ పొంతన విషయంలో చాలా మంది సందిగ్ధంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ వధూవర పొంతనల విషయంలో కొందరు ఏకవింశతి కూటములని, కొందరు ద్వాదశ వర్గములని, కొందరు దశ వర్గములని, కొందరు అష్టకూటములని, కొందరు షడ్వర్గములని మరికొందరు చతుర్వర్గములని విభిన్న వాతావరణము కనిపిస్తోంది. ఏకవింశతి కూట వర్గములు :
1. గ్రహ మైత్రి వర్గము, 2. గుణ వర్గము, 3. స్త్రీ దీర్ఘవర్గము, 4. యోని వర్గము, 5. నాడీవర్గము, 6. రాశి వర్గము, 7. మహేంద్ర వర్గము, 8. గణిత ఆయుష్య వర్గము, 9. ఆయ వర్గము, 10. వశ్య వర్గము, 11. దిన కూటమి, 12. జాతి వర్గము (వర్ణ కూటమి), 13. నక్షత్ర జాతి వర్గు, 14. వేదా వర్గము, 15. పక్షి వర్గము, 16. రజ్జు వర్గము, 17. యోగినీ వర్గము, 18. లింగ వర్గము, 19. భూత వర్గము, 20. చంద్రయోగవర్గము, 21. గోత్ర వర్గము ఈ విధముగా ఉన్నను వాడుకలో పలు పంచాంగములందు తెలుపబడిన అష్టకూటమికి సంబంధించిన గుణమేళన చక్రమును ఫాలో అవటం జరుగుతోంది. అసలు గుణమేళన చక్రాన్ని పరిశీలించినట్లయిన అష్టకూటమిలో ఎనిమిది రకాలభావాలనుపరిశీలించడం జరుగుతోంది. కాని అది ఒక్క చంద్రగ్రహ ప్రభావంతో మాత్రమే ఇక్కడ గ్రహాలకు శాంతి చెయ్యి – పైన ఉన్న గ్రహాలు అనుగ్రహిస్తాయి. పరిశీలిస్తున్నాము. విపులంగా పరిశీలించినప్పుడు 1. వర్ణము (ఇరువురి యొక్క రాసులు ఏవర్ణము పరిశీలించుట), 2.వశ్యవర్లు (నర, జల, చర త్రివర్గ రాశులను పరిశీలించుట), 3. రాశికూటమి (వధూవరుల జన్మ రాశులకు గల అవినాభావ సంబంధములను చంద్రబలముచే పరిశీలించుట), 4. గ్రహ మైత్రి, (జనన కాల చంద్ర స్థితి రాశి నాధుల మిత్రత్వ, శత్రుత్వ, సమతత్వములను, షష్టాష్టకాలు, ద్వి, ద్వాదశాలు పరిశీలించుట), 5. యోనికూటమి(వైరముకాని జంతువులను పరిశీలించుట), 6. గణ కూటమి (దేవ, మనుష్య, రాక్షస గణములను పరిశీలించుట), 7. నాడీ కూటమి (వాత, పిత్త, శ్లేష్మాది ఆరోగ్య విషయములపై ఆది, మధ్య, అంత్య, నాడీ గుణములను పరిశీలించుట), 8. నక్షత్ర నిర్ణయము (వధూ జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రమునుండి వరుడు జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రమునకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ, సంకర జాతుల ఆధిక్యతను గమనించుట,మరియు వధువునుంచి వరుని వరకు తారా బలమును కూడా గమనించుట) ఇవ్విధములైన ఈ అష్టకూటమిలోని 8 గుణములను పరిశీలన ప్రమేయమే ఈ గుణమేళన పట్టిక స్వరూపము. మరి ఇంత పరిశీలన జరిపినప్పటికి ఇది ఎంతవరకు ఉపయోగ పడుతోంది అనేది చెప్పలేని పరిస్థితి. కారణం ఇది కేవలము చంద్రగ్రహ సంబంధముగానే ఏర్పరచినందువల్ల, నక్షత్ర రీత్యా, చంద్రగ్రహ రీత్యా, జన్మరాశి రీత్యా, లేదా నామనక్షత్ర, చంద్రగ్రహ నామరాశిరీత్యా ప్రాధమిక అంశాలకు మాత్రమే పరిమితమైనదిగా చెప్పవచ్చు. సింహరాశికి సప్తమ రాశి కుంభ రాశి, మరి కుంభరాశికి సప్తరాసి సింహరాసి. రాశ్యాధి పతులు శత్రువులు అయినప్పటికి వాటిలో వివాహము అయినవాళ్ళు బాగానే ఉంటున్నారు కదా. అలాగే తారను చూసినప్పుడు అమ్మాయినుంచి అబ్బాయికి చూచుటయే ప్రధాన మైనదిగా వస్తోంది. అటువంటప్పుడు అశ్విని నక్షత్ర అమ్మాయిని రోహిణి నక్షత్ర అబ్బాయికి క్షేమ తార. రివర్సులో అబ్బాయినుంచి అమ్మాయికి నైధనతార వస్తోంది. మరి అబ్బాయికి నైధనతార అయినప్పటికి పనికివస్తుందా, ఫలితం ఎవరికైనా ఒకటేకదా అంటే ఇక్కడ తార ప్రధానం కాదని తెలుస్తోంది. నైధనతార అయినప్పటికి 23 పాయింట్లు వస్తున్నాయి కదా. 18 పాయింట్లు దాటితే చేసుకోవచ్చు అంటున్నారు కదా. మరి నైధనతార వద్దంటారేమిటి. మరొకటి కృత్తికా నక్షత్రం అమ్మాయికి మూలా నక్షత్రం అబ్బాయిది మిత్రతార అయింది. రివర్సులో అబ్బాయినుంచి అమ్మాయికి చూచినట్లయిన విపత్తార అవుతున్నది. 29 పాయింట్స్ వచ్చాయి కదా, ఇక్కడ కూడా 18 పాయింట్స్ దాటాయికదా, విపత్తార వద్దంటారేమిటి? భరణీ నక్షత్రం అమ్మాయికి మృగశిరా నక్షత్రం అబ్బాయికి క్షేమ తార అయినది. మరి క్షేమతార అయినప్పటికి 15 పాయింట్లు మాత్రమే వచ్చాయికదా. క్షేమ తార అయినదని ముందుకువెళ్ళాలా, 18 పాయింట్లుకంటే తక్కువ వచ్చినవి కనుక అక్కడ ఆగాలా? నిర్ణయము ఏం తీసుకోవాలి. మరొకటి మూల నక్షత్రం అమ్మాయికి కృత్తికా నక్షత్రం అబ్బాయికి విపత్తార అయినది. మరి 29 పాయింట్సు వచ్చాయి కదా. విపత్తార వద్దంటారేమిటి? ఇక్కడ అష్ట కూటమిలో ఎనిమిదవ భాగంగా తారను గమనించే సాంప్రదాయము ఉన్నప్పటికి తార అనేది ముహూర్త భాగంలో ముఖ్యమైనదిగా చెప్పబడుతోంది. అక్కడ కూడా కొన్ని నవకాల్లో ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అలాగే ఆశ్లేష అత్తగారికి గండము, మఖ మావగారికి గండము, మూల ముసలమ్మకి గండము, విశాఖ, జ్యేష్ట నక్షత్రాలకి అయితే వధూవరుల సోదరులకు గండము ఇలా కేవలము నక్షత్రాన్ని బట్టి అంచనా వేయటము చాలా విపరీత ఆలోచనలు. అట్లాంటి దోషాలకి జాతక చక్రములో నివృత్తులు ఉంటాయి. జన్మ లగ్నాత్ 3, 4, 7, 9, 10 భావాలపై చంద్రుడుకాని భావాధిపతులు శుభగ్రహ సంబంధం కలిగి ఉన్నట్లైన నివృత్తి కలిగినట్లుగానే భావించాలి. ఏ హాని ఉండదు. జేష్ట, వివాహ విషయమై విరోధ జంతువులు : లేడి – కుక్క, ఆవు – పులి, పాము – ముంగిస, సింహము – ఏనుగు, గుఱ్ఱము – దున్నపోతు, కోతి – మేక, ఎలుక – పిల్లి. వధూవరులకు పరస్పర వైరము కలిగించు వేధ నక్షత్రములు : అశ్విని భరణి అనూరాధ, కృత్తిక విశాఖ, రోహిణి స్వాతి, ఆరుద్ర శ్రవణము, రేవతి, పునర్వసు – ఉత్తరాషాడ, పుష్యమి – పూర్వాషాడ, ఆశ్రేష – మూల, మఖ పుబ్బ – ఉత్తరాభాద్ర, ఉత్తర – పూర్వాభాద్ర, హస్త – శతభిషము ఈ తారలకు వేధ కలిగి యుండును. కావున ఈ నక్షత్రముల జంటలలో ఒక జంట దంపతుల నక్షత్రములు ఉన్నచో వారికి కలహ కరంబు అగును. ద్విపాద నక్షత్రములకు చిత్త – మృగశిర – ధనిష్ఠలు పరస్పర వైరము కలవై యుండును. అలాగే త్రిజ్యేష్ఠ వివాహమునకు వధూవరులు ఇరువురు మొదటి సంతానమై వారిలో ఒకరు జ్యేష్ఠమాసమున పుట్టినను లేక ఒకరు జ్యేష్టా నక్షత్రమున పుట్టినను కూడా త్రిజ్యేష్ఠ అనబడును. అట్లే జన్మతారయై అనగా ఇరువురిది జ్యేష్ఠనక్షత్రము అయి ఒకరు అందులో ఒకరు జ్యేష్ఠులైనచోకూడ త్రిజ్యేష్ఠ అనబడును. స్త్రీ పురుష సంతానములో మొదటి సంతతిని జ్యేష్ఠులు అందురు. వీరికన్న ముందర ఎవరైనా మృతులైనచో బ్రతికిన వారిలో జ్యేష్ఠులుగా లెక్కించరాదు. వధూవరులు ఇరువురు జ్యేష్ఠులైనచో జ్యేష్ఠమాసమున వివాహము చేయరాదు. బ్రాహ్మణులకు గ్రహమైత్రి, క్షత్రియులకు గుణ కూటమి, వైశ్యులకు రాశికూటమి లేక స్త్రీ దీర్ఘకూటమి, శూద్రులకు యోని పొంతనము చూచుటే సాంప్రదాయము. ఇక అశ్విని, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, అనూరాధా, పూర్వాషాడా, ఉత్తరా షాడా, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రములవారు వధూవరులకి ఏక నక్షత్రము అయినను వివాహము జరిపించవచ్చును. మిగతా నక్షత్రాదులకు పాదభేదము ఉన్నప్పటికి రాశి ఒకటే అయినను లేదా రాశిబేధము ఉన్నప్పటికి వదిలివేయుటే మంచిది. పై నక్షత్రములు ఒకటే అయినను చేసుకోవచ్చునను సాంప్రదాయము ఉన్నప్పటికి కొద్దిగా విశ్లేషించి చేసుకొనుట మంచిది. లేనట్లయిన ఒకే నక్షత్రము అయినప్పుడు కొన్ని సమయములలో వధూవరులకు ఒకే గ్రహ దశ జరుగవచ్చును. బాగుండవచ్చును, లేదా బాగుండక పోవచ్చును. గోచార వశాత్తూ ఇద్దరికి ఏలినాటి శని, రాహుకేతువుల పరిస్థితి సరిలేనిచో ఇద్దరికి ఒకే విధమైన గ్రహ గతులు జరుగుతున్నప్పుడు కొన్ని సమయములందు అప్, కొన్ని సమయములందు డౌను జరుగవచ్చును. అలాంటి సమయములందు ఎవరు ఓదార్చెదరు. అదే ఇరువురి నక్షత్రములు వేరైనచో ఎవరో ఒకరి జాతక గోచార ప్రభావములు బాలన్స్ చేస్తూ ఉండవచ్చును కదా. ఉండే అవకాశము ఉందికదా. అందుచేత తప్పదు అనుకొనునప్పుడు వధూవరుల జాతక చక్రములను విశ్లేషించిన తరువాతనే ముందుకు వెళ్ళుట మంచిది. ఇత్యాది విషయములను విశ్లేషించినప్పుడు నక్షత్ర పొంతనే ప్రధానమనుకొనినప్పటికి వధూవర రాశులు శత్రు, లేదా షష్టాష్టకాలు అయినప్పటికి, నక్షత్రాలు ఏకనాడైన, రాశ్యాధి పతులు విరోధులైన, వధూవరులకు విపత్తారలు, నైధన తారలు అయినప్పటికి, వధూవర జన్మ జాతకాలందు లగ్న చతుర్ధ పంచమ సప్తమ అష్టమ భావాలు అధిపతులు కారకులు కుజ గురు శుక్రులు బలములు ఉన్నచో ఈ గుణమేళన చక్ర ప్రభావము ఉండుటలేదు. అందుచే వధూవరుల ఇరవురికి జాతక పరిశీలన మాత్రమే ముఖ్యమని అనుభవములో
తెలియుచున్నది.
14.పతి వ్రతముచే – స్త్రీ ఆదిశక్తి
14.పతి వ్రతముచే – స్త్రీ ఆదిశక్తి స్త్రీ తమ భర్తని పరమేశ్వరునిగా భావించాలి. విసుగులేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా దానధర్మాలు చేయరాదు. ఇరుగుపొరుగు ఇళ్లకు తరచు వెళ్లరాదు. తప్పనిసరి అయినపుడు ఇంట్లో
8.ఎంత గొప్పవాడు ఏలినాటి శని
8.ఎంత గొప్పవాడు ఏలినాటి శని ఎవరినోట విన్నా ‘కొంప ముంచాడురా శనిగాడు’ అంటుంటారు. లేదా అయిదు సంవత్సరములనుంచి పడే బాధలు ఏమి చెప్పమంటారు. ఆరోగ్యం కృంగిపోయింది, ఆర్ధికంగా అంటావా ఆపరేషనుకు రెండు లక్షలు అయ్యాయి.
15. వేమన గురుతత్త్వము
15. వేమన గురుతత్త్వము సద్గురువును ఆశ్రయించుటవలన శులభముగ మోక్షమార్గమును పొందవచ్చును. శ్రమలేకుండా సమస్యలను దాటవచ్చును. మంచి ఆహారము తీసికొనుట వలన మంచి గుణములు వచ్చునట్లు సద్గురు బోధనలవలన మంచి ప్రవర్తన కలిగి మోక్షమును పొందవచ్చును.