15. వేమన గురుతత్త్వము

సద్గురువును ఆశ్రయించుటవలన శులభముగ మోక్షమార్గమును పొందవచ్చును. శ్రమలేకుండా సమస్యలను దాటవచ్చును. మంచి ఆహారము తీసికొనుట వలన మంచి గుణములు వచ్చునట్లు సద్గురు బోధనలవలన మంచి ప్రవర్తన కలిగి మోక్షమును పొందవచ్చును. యజ్ఞ యాగాదులు, తపస్సు, తీర్థయాత్రలు, చేసినప్పటికి స్వామిని కనుగొనలేరు. పరమాత్మను చేరుకొనే విధానమును గురువు మాత్రమే బోధించగలడు. కాలమును వృధా చేయకుండా గురువును చేరి వారి మార్గమును విశ్వశించి ఆచరించినట్లయిన మోక్షమును పొందవచ్చును. గురువును బాగా సేవించి మనస్సుతో విన్న దానిని జపం చేయుచు తపస్సు చేసినట్లయిన తత్త్వజ్ఞానము తెలిసిన యోగీశ్వరుడు అగును. ఉంటాడు.సరియైన మార్గం లేకుండా ఉపవాసాలు చేయటము, తపస్సు చేయటము వలన ప్రయోజనము లేదు. జపము చేయటంలో గురువుయొక్క మాటని జవదాట కూడదు. లోకంలో గురువుని స్తుతిస్తూ తన్మయుడయినవాడు నిశ్చలమయిన మనసు గలవాడు అయినచో ఇహలోక సుఖాలకు అసత్యాలు మాట్లాడరు. గురువు జన్మజన్మల పాపములను పటాపంచలు చేసి పరతత్త్వాన్ని చూపించి మనసునందు వెలుగు రూపంలో ఎల్లవేళల అందరు అక్షర జ్ఞానాన్ని కావ్య శాస్త్రాలను చెప్పవచ్చును. కాని మోక్షమార్గాన్ని బోధించేవాడు మాత్రమే గురువు. గురువు ఆవువంటివాడు. శిష్యుడు దూడలాగ తిరుగుచున్నచో గురువు అమృతతత్త్వాన్ని తగిన సమయంలో అందిస్తాడు. గురువు పరమాత్మ, శిష్యుడు జీవాత్మ. వీరిరువురు కలిసిన జీవన సంపద కల్గుతుంది. అటువంటి జీవ సంపదను సృజించువాడే గురువు. వృక్షమూలము గురువయిన కొమ్మవంటివాడు శిష్యుడు. గురువులేనిదే శిష్యుడు వుండడు. శిష్యులకు జ్ఞానోపదేశము చేసే గురువులు కనుబడుటలేదు. అట్లాంటి శిష్య సంబంధం గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఉంటుంది. గురువులో ఐక్యం చెందినటువంటివాడు బ్రహ్మజ్ఞానంతో మోక్షాన్ని పొందగలుగుతాడు. గురుబోధలలో అంతరార్ధం తెలిసికొన్నట్లయిన కష్టమనేది కనిపించదు. తాళంచెవిలేకుండా తలుపు ఏవిధంగా రాదో గురూపదేశం లేకుండా ఆత్మజ్ఞానం ఎవరు తెలిసికొనలేరు. గురువు యొక్క మహిమ సామాన్యులకు అంతత్వరగా తెలిసే అవకాశము ఉండదు. మహాత్ములకు వెంటనే తెలియగలదు. నిజమైన గురువు శిష్యునిలోని అజ్ఞానాన్ని పాలద్రోలి బ్రహ్మతత్త్వాన్ని చూపించగలడు. రాజులేనిదే రాజ్యపరిపాలన జరగనట్లు గురువులేకుండా సరియైన విద్య అవకాశము ఉండదు. బట్టలోని మురికి పోవుటకు బట్టలు ఉతుకునట్లుగా శిష్యుని అజ్ఞానాన్ని పోగొట్టుటకు గురువు దండించుట తప్పుకాదు. గురుశిష్య సంబంధము బాగుగా తెలిసికొని భక్తితో గురువును సేవించగలిగినప్పుడే మనసులోని సందేహములు అన్ని తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది. తన శరీరంలోనే ఉన్న పరమాత్మను తెలిసికొనలేక భగవంతుని దర్శనంకోసం దేశమంతటా తిరుగుతుంటారు. అటువంటివారి కోరికను తీర్చగలవాడు గురువు మాత్రమే. పట్టుకున్న కొమ్మను వదిలివేసి ఆధారము లేదనుకొంటారా, చెట్టు ఎక్కేటప్పుడు కొమ్మను ఆధారంగా పట్టుకొని పైకి ఎక్కినట్లే గురువుని ఆధారంగా చేసికొని భగవంతుని యొక్క నిర్గుణ స్వరూపాన్ని తెలిసికోవాలి. శిష్యునియొక్క కర్మ పరిపక్వము చేయుటకు అతని హృదయ పరిస్థితిని చూసి జ్ఞానవంతునిగా చేయువాడే గురువు. అతడే పరబ్రహ్మ స్వరూపముగా భావించాలి. తుమ్మెద తనగూటిలో ఒకపురుగును ఉంచి దానిచుట్టూ శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. కొంతకాలానికి పురుగు తుమ్మెదలాగ మారిపోతుంది. అలాగే గురువుకూడ. చెట్టు తనవద్దకు వచ్చినవారికే నీడను ఇవ్వగలదు. గురువుకూడ తనకు సన్నిహితంగా ఉన్నవానికే బోధించగలడు. పాలల్లో నీటికి ఏ విధంగా పాలలక్షణాలు వస్తాయో గురువుకి సన్నిహితంగా ఉంటే శిష్యుడుకూడ పండితుడు అవుతాడు. స్థిరమైన మనసు లేకుండా అక్షమాలను తిప్పటంవలన ప్రయోజనము ఏముంటుంది. గురుతత్త్వాన్ని పొందినప్పుడే జ్ఞానోదయము కలుగుతుంది. ఈ లోకానకంతటికి ఆధారము గురువు. “ఓం” కారానికి ఆధారం పరమగురువు శివుడు. గాయత్రిమంత్రం జపిస్తే సకల కర్మలకు గురువు అవుతుంది. ఈ లోకంలో తల్లితండ్రి మొదటి గురువులు. పార్వతీ పరమేశ్వరులు పరమ గురువులు. లోకంలో తల్లిదండ్రులను పరమాత్ముని సేవిస్తేనే పరమార్ధము ఉంటుంది. గురువు ఉండవలసిన స్థానములో ఉంటేగాని గురుశిష్యులలో మొదట ఎవరు, చివర ఎవరు అని గాని గురువు ఎవరు శిష్యుడు ఎవరు అని కాని తెలియదు. కాబట్టి గురువు ఎప్పుడూ ఉన్నతస్థానంలోనే ఉండితీరాలి.

గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము తోటి మనిషితో ఎట్లా ప్రవర్తించాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటము, ఇంటికి వచ్చిన అతిథులతో గౌరవించుకొనటము, మంచి సాంప్రదాయ సంస్కారములతో బ్రతుకు వెళ్లబుచ్చటము, ఇతరులకి ఇష్టములేని పని

Read More »

10.నిత్య దేవతార్చనచే – ప్రశాంత జీవనం

10.నిత్య దేవతార్చనచే – ప్రశాంత జీవనం వైదికము, సనాతనము, ధర్మశాస్త్రము అనుసరించి స్వధర్మ ఆచరణ చేయుటయే భగవంతుని ఆరాధన. మనకి ఉన్న దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణములను నిత్య కర్మలను ఆచరించుటద్వారా

Read More »

6.రత్న ధారణకు సంశయాలే

6.రత్న ధారణకు సంశయాలే ప్రస్తుత సమాజములో ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారివారి విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు. మరి అందరూ తలోరకంగా ధరించమంటుంటే ఏది ఆచరించాలి అనేది రత్నం ధరించేవానికి సందేహంగానే ఉంటుంది.

Read More »