3.సంతానలేమికి - కుజగ్రహ ప్రభావమేనా

సంతానము అంటే వెంటనే మొత్తం కుజగ్రహానికి లింకు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమోఅర్థంకావటంలేదు. నిజానికి కుజుడు ప్రస్తుత సమాజంలోపూర్తిచైతన్యవంతంగానే నడిపిస్తున్నాడు. పది సంవత్సరములు నిండని కుర్రవాడు ఆపోజిట్ సెక్సుతో  స్నేహం చేసి పరిగెత్తెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చైతన్యం ఒక మోతాదు కంటేఎక్కువగానే కనిపిస్తోంది. థ్రిల్ ఎంజాయిమెంటుకు ఆయనే కారకుడు. సంతానానికి ఒకప్రోజెక్ట్ మేనేజర్ లాంటి వాడు. కాని ఆయనదే పూర్తి బాధ్యత కాదు. ఒక వస్తువుని మనంతయారు చేయాలంటే దాన్ని ఒక ప్రోజక్ట్ గా తీసు కుంటాము. దానికి ఒక ప్రోజక్ట్ మేనేజర్,నలుగురు సూపర్వైజర్లు, ఒక డైరెక్టరు కావాలి. అలాగే వస్తువు తయారీకి సంబంధించినద్రవ్యాలు, రా మెటీరియల్స్, దానికో స్టోర్ ఇన్చార్జి ఇవన్నీ అవసరము ఎలాగో, అలాగేఇక్కడ సంతతికి కూడ సూపర్వైజర్స్ ఉంటారు. వారు కరక్టు పొజిషన్లో ఉన్నారా లేదా,పుత్ర స్థానాధిపతి పొజిషన్ ఏమిటి, పుత్రస్థాన స్థితిగత గ్రహ పరిస్థితి ఏమిటి, పుత్రస్థానానికిఏదైనా శుభాశుభ దృష్టి ఉన్నదేమో దాని పరిస్థితి ఏమిటి, అలాగే పుత్రకారకుడు గురుడుఆయన కూడా ఒక డైరెక్టరే. వీరందరూ ఓకే అని సిగ్నల్ ఇచ్చి సైన్ చేయాలి కదా.అంతకంటే ముఖ్యమైనది రా మెటీరియల్స్ వీర్యకణాలు ఈ ప్రాజెక్ట్క ప్రధానమైన ధాతువులు.ఇవి ఎవరు సప్లై చేస్తారు. శుక్ర గ్రహము మాత్రమే సప్లై చేస్తుంది. ఇంకెవరూ చేయలేరుకూడా. ఈ కణాలు మేనే ఫేక్చరు చేస్తుంది, స్టోరేజ్ చేస్తుంది, సప్లై కూడా చేస్తుంది. ఈగ్రహ పరిస్థితికూడా చెక్ చేయాలి కదా. ఒకవేళ తేడాగా ఉంటే దీనికి సంబంధించినశాంతులు చేయాలి కదా. బొబ్బర్లు దానము చేయాలి కదా. తినాలి కదా, ఆవుపాలుతాగాలి కదా, ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి వాడాలి కదా. శుక్రుని అధిష్టాన దేవతమహాలక్ష్మి, సంతానలక్ష్మిని పూజించాలి కదా, హోమం చేయించాలి కదా. ఇవి ఏమైనాచేస్తున్నారా. కుజుడు, కందులు, సుబ్రహ్మణ్య అభిషేకం, షష్టి, చవితి చాలా చేసేసాం, కానిఎందుకో ఫలించటం లేదు అంటున్నాము. కుజగ్రహము ఎంతటివారికైనా ప్రస్తుత సమాజంలోపూర్ణ చైతన్య వంతుడే ఆయనకు రా మెటీరియల్ శుక్రకణాలు అందించాలి. అలాగేమొదట అనుకొనినట్లు పుత్ర స్థానాధిపతి, పుత్రస్థితి నాయకుడు, పుత్ర స్థానానికి దృష్టినాధుడు,పుత్ర కారకుడు ఈ సూపర్వైజర్స్ అందరూ ఓకే సిగ్నల్స్ ఇవ్వాలి కదా. వారు సరిగా
రాఇక్కడ గ్రహాలకు శాంతి చెయ్యి – పైన ఉన్న గ్రహాలు అనుగ్రహిస్తాయి.లేనట్లైనా వారికి శాంతి చేయాలికదా. అప్పుడు కుజుడు ఆయన డ్యూటీ ఆయన చేస్తారు.అంటే ఫ్రిజ్లో పాలు పళ్లని పాడవకుండా ఎలా కాపాడుకుంటామో అలాగే స్త్రీ పురుషకణాలతో ఏర్పడే గుడ్డుని జాగ్రత్తగా తగినంత టెంపరేజర్ని ఉంచి కాపాడే బాధ్యత కుజునివంతు అవుతుంది. కాబట్టి జపతపాదులు చేసేటప్పుడు కుజదోషము ఉన్ననూ లేకపోయిననూఆయనకు చేసే శాంతులతోపాటు శుక్రునికి కూడా శాంతులు చేయాల్సిన అవసరము
ఉందేమో గమనించి పాటించాల్సిన అవసరము ఉంది. పాటిస్తే ఫలించే అవకాశముఉంటుంది. ఇలా సంతానము లేటవుతోందని పూర్వం పెద్దవాళ్ళదగ్గరకు వెళితే ఆవునిపెంచమని సలహా ఇచ్చేవారు. అప్పటిలో అవకాశాలు ఉన్నాయి కనుక ఆవును తెచ్చుకుని
పెంచుకునేవారు. ఏడాది తర్వాత పిల్లలు పుట్టడము వెంటనే పెద్దాయన దగ్గరకు వెళ్ళిఆవుని మీరు చెప్పినట్లు పెంచామని దైవికంగా ప్రయత్నం ఫలించిందండి అని చెప్పేవారు.ఇక్కడ గమనించాల్సింది ఆవుని పెంచుకున్నప్పుడు వచ్చే పాలు, పెరుగు, నెయ్యి ఇంట్లోవాడుకుంటారు కదా. ఆ ధాతుపుష్టికి ఇది మహా ఔషధం అన్న మాట. ఇది కనిపించనివైద్యం, అట్లాగే శ్రావణ మంగళవారం నోములలో కూడా ఆవునెయ్యి వత్తులలో చివరిదిలోపలికి తీసుకోవడం ఆచారం. ఇప్పుడు ఆవుని పెంచమనటానికి బదులు ఆవుపాలువాడమంటున్నాము. అలాగే స్త్రీలు సంతాన ప్రాప్తి కొరకు రావిచెట్టుకి ప్రదక్షణలుచేయుటవలన గర్భ సంబంధిత సమస్యల నివారణ, మరియు అభిషేకించిన ఆవుపాలుత్రాగుట వలన గర్భశుద్ది జరుగును. ఇవన్నీ మనము గ్రహించి పాటించే ప్రయత్నం చేస్తేశుభమే జరుగుతుంది.అలాగే వధూవరులు ఆనందంగా జీవించాలంటే ప్రకృతిలో కుజ శుకృల పాత్రయే
ఎక్కువ ఉంది. వారిద్దరూ సమఉజ్జీలో ఉంటే చక్కటి సంసారజీవనం జరుగుతుంది.అందుచేత కుజగ్రహ అధిష్ఠానదేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుజగ్రహ అవతారమైనలక్ష్మీనరసింహ స్వామిని నవదేవీమాత లలితాదేవిని మరియు శుకృని అధిష్ఠానదేవత,నవదేవీమాత అయిన మహాలక్ష్మీదేవిని నిత్యము అర్చించుకొనినట్లయిన జీవనమంతాఆనందమయం అవుతుంది అనుటలో సందేహము లేదు.

2.సమాజము – వివాహ వ్యవస్థ

2.సమాజము – వివాహ వ్యవస్థ చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది సమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృహస్థాశ్రమము  వినా మరో మార్గాంతరము లేదు.

Read More »

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము తోటి మనిషితో ఎట్లా ప్రవర్తించాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటము, ఇంటికి వచ్చిన అతిథులతో గౌరవించుకొనటము, మంచి సాంప్రదాయ సంస్కారములతో బ్రతుకు వెళ్లబుచ్చటము, ఇతరులకి ఇష్టములేని పని

Read More »

1.కుజగ్రహము-అనుగ్రహము

1.కుజగ్రహము-అనుగ్రహము ప్రస్తుత సమాజమున వయసు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు ఒక జ్యోతిష్కుని కలిసిన వెంటనే వారికి ఉండే సందేహము మొదటిగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏమైనా కుజదోషము ఉందా? అనే

Read More »