13.శాంతి విధానేన రోజువారి పారాయణలు

ఆదివారము : ఆధిపత్యము – రవి, అధిదేవత – అగ్ని, ప్రత్యధిదేవత – ఋద్రుడు, అధిష్ఠాన దేవత – శివుడు, నవదేవీ మాత – గాయత్రీదేవి, పరమాత్మ అంశ – రామావతారం.

పారాయణకు : రవి అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, శివ అష్టోత్తరము, రామ అష్టోత్తరము, గాయత్రీ అష్టోత్తరము.

సోమవారము : ఆధిపత్యము – చంద్రుడు, అధిదేవత వరుణ, ప్రత్యధిదేవత – గౌరీదేవి, అధిష్ఠాన దేవత – భువనేశ్వరీ దేవి, నవదేవీ మాత – అన్నపూర్ణాదేవి, పరమాత్మ అంశ – కృష్ణావతారము.

పారాయణకు : చంద్ర అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము, భువనేశ్వరీ అష్టోత్తరము, అన్నపూర్ణ అష్టోత్తరము, కృష్ణ అష్టోత్తరము.

మంగళవారము : ఆధిపత్యము కుజుడు, అధిదేవత – పృథ్వి, ప్రత్యధిదేవత క్షేత్రాపాలకుడు, అధిష్ఠాన దేవత – సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవదేవీ మాత – లలితాదేవి, పరమాత్మ అంశ – నృసింహ స్వామి.

పారాయణకు : కుజ అష్టోత్తరము, ఆంజనేయ అష్టోత్తరము, సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరము, లలితా అష్టోత్తరము, నృసింహ అష్టోత్తరము.

మంగళవారము : ఛాయా గ్రహము కేతువు కుజుని ఫలితాలు ఇచ్చుటచే కేతువు సంబంధిత పారాయణలుకూడ చేయవలయును.

కేతువు : అధిష్ఠాన దేవత – వినాయకుడు, అధిదేవత – చిత్రగుప్తుడు, ప్రత్యధిదేవత – బ్రహ్మ, నవదేవీ మాత – రాజరాజేశ్వరీ దేవి, పరమాత్మ అంశ – మత్స్యావతారము.

పారాయణకు : కేతు అష్టోత్తరము, చిత్రగుప్త అష్టోత్తరము, వినాయక అష్టోత్తరము, రాజరాజేశ్వరీ అష్టోత్తరము, మత్స్యావతార అష్టోత్తరము.

బుధవారము : ఆధిపత్యము – బుధుడు, అధిదేవత విష్ణువు, ప్రత్యధిదేవత – నారాయణుడు, అధిష్ఠాన దేవత – విష్ణువు, నవదేవీ మాత – బాలా త్రిపుర సుందరి, పరమాత్మ అంశ – బుద్ధావతారము.

పారాయణకు : బుధ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, బాలా త్రిపుర సుందరి అష్టోత్తరము, బుద్ధ అష్టోత్తరము, శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరము .

గురువారము : ఆధిపత్యము – బృహస్పతి, అధిదేవత – బ్రహ్మ, ప్రత్యధిదేవత ఇంద్రుడు, అధిష్ఠాన దేవత – దక్షిణా మూర్తి, నవదేవీ మాత – సరస్వతీ దేవి, పరమాత్మ అంశ – వామనావతారం.

పారాయణకు : గురు అష్టోత్తరము, దక్షిణామూర్తి అష్టోత్తరము, దత్తాత్రేయ అష్టోత్తరము, సరస్వతి అష్టోత్తరము, వామన అష్టోత్తరము.

శుకృవారము : ఆధిపత్యం – శుక్రుడు, అధిదేవత – ఇంద్రాణి, ప్రత్యధిదేవత – ఇంద్రుడు, అధిష్ఠానదేవత – లక్ష్మీదేవి, నవదేవీ మాత – లక్ష్మీదేవి, పరమాత్మ అంశ – పరశు రాముడు.

పారాయణకు : శుక్ర అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, గాయత్రీ అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము, పరశురామ అష్టోత్తరము.

శనివారము : ఆధిపత్యము – శని, అధిదేవత – యమ, ప్రత్యధిదేవత – ప్రజాపతి, అధిష్ఠానదేవత – శివుడు, నవదేవీమాత – శ్రీ దుర్గాదేవి, పరమాత్మ అంశ – కూర్మావతారము.

పారాయణకు : శని అష్టోత్తరము, దుర్గా అష్టోత్తరము, శివ అష్టోత్తరము, శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరము, కూర్మ అష్టోత్తరము.

శనివారము : ఛాయా గ్రహము రాహువు శని ఫలితాలు ఇచ్చుటచే రాహు సంబంధిత పారాయణలుకూడ చేయవలయును. 

రాహువు : అధిదేవత – గోమాత, ప్రత్యధిదేవత – సర్ప, అధిష్ఠాన దేవత – కనకదుర్గ, నవదేవీ మాత – మహిషాసుర మర్ధని, పరమాత్మ అంశ –వరాహస్వామి.

పారాయణకు : రాహు అష్టోత్తరము, కనకదుర్గ అష్టోత్తరము, గోమాత అష్టోత్తరము, మహిషాసుర అష్టోత్తరము, వరాహస్వామి అష్టోత్తరము.

ప్రతి శుభకార్యమునకు వివాహము, గృహప్రవేశము, వృత్తివ్యాపారాదుల ప్రారంభము నందు శ్రీరమాసత్యనారాయణ స్వామి వారి వ్రతము అనాదిగా హిందూ సంస్కృతిలో ఆచరించుట సాంప్రదాయము. ప్రధానముగా ఈ వ్రతమును ఆచరించుటకు కారణము ఆదిత్యాది నవగ్రహదేవతలు, అధిదేవతలు, ప్రత్యధిదేవతలు, అధిష్ఠానదేవతలు, అష్టదిక్పాల కులను సకల దేవతలను ఆవాహన చేసి వ్రతమాచరించుటవలన సమస్త జనావళికి శుభప్రదము. కావున శుభకార్య ప్రారంభమునకు ఈ వ్రతము ఆచరించుట ప్రాముఖ్యత సంతరించుకున్నది.

13.శాంతి విధానేన రోజువారి పారాయణలు

13.శాంతి విధానేన రోజువారి పారాయణలు ఆదివారము : ఆధిపత్యము – రవి, అధిదేవత – అగ్ని, ప్రత్యధిదేవత – ఋద్రుడు, అధిష్ఠాన దేవత – శివుడు, నవదేవీ మాత – గాయత్రీదేవి, పరమాత్మ అంశ

Read More »

1.కుజగ్రహము-అనుగ్రహము

1.కుజగ్రహము-అనుగ్రహము ప్రస్తుత సమాజమున వయసు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు ఒక జ్యోతిష్కుని కలిసిన వెంటనే వారికి ఉండే సందేహము మొదటిగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏమైనా కుజదోషము ఉందా? అనే

Read More »

2.సమాజము – వివాహ వ్యవస్థ

2.సమాజము – వివాహ వ్యవస్థ చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. మిగిలిన మూడు ఆశ్రమములకు ఆశ్రయము ఇచ్చునది గృహస్థాశ్రమము. ఇది సమస్త ప్రాణులకు ఆధారమై ఉన్నది. ఋణత్రయ విమోచనమునకు గృహస్థాశ్రమము  వినా మరో మార్గాంతరము లేదు.

Read More »