హోమశాంతులు

1.నవగ్రహ హోమం

           జీవనసాగరంలో మానవునికి విధివశాత్ సంభవించే సమస్యలకు పరిష్కారము నవగ్రహ ఆరాధన ఒకటి. శాంతి ప్రక్రియలు అనేకము ఉన్నప్పటికి వాటిలో హోమ ప్రక్రియ జ్యోతిర్వైద్యంగా భావించవచ్చు.

ఈ గ్రహాలకు సంబంధిత వివిధ సమిధలు ఉపయోగించుట వలన ఆయా గ్రహముల నుండి దోషనివారణ జరిగి మానశిక శారీరక ఋగ్మతలు నివారించబడి ఆయురారోగ్యఐశ్వర్యములు కలుగును అనుటలో సందేహము లేదు.

2. గణపతి హోమము

        జీవనసాగరంలో సమయానుకూలంగా అనేక శుభ కార్యములు తలపెడుతూ ఉంటాము. అట్లాంటి సమయంలో మనము చేసే పనికి అవాంతరములు కలుగకుండా ఉండటానికి ఈ హోమము ప్రత్యేకత. మనము క్రమశిక్షణతో ఆదమరపుగా లేకుండా చేసే కార్యంమీద దృష్టి పెట్టాలి. ఈ హోమము చేయుట వలన మనలో వికారములు ఏమైనా వుంటే అవి తొలగిపోయి బుద్ధి, జ్ఞానము కలిగి ఏ కార్యము అయితే ప్రారంభిస్తామో ఆ కార్యం మీద దీక్ష కలిగి మంచి సంకల్పసిద్ధి ఏర్పడటం జరుగుతుంది. తత్కారణంగా కార్యమునందు విజయసిద్ధి లభిస్తుంది అనుటలో సందేహము లేదు.

3. మహాలక్ష్మీ హోమము

      లక్ష్మీదేవి అంటే తెలియనిది ఎవరికి. సంపద. వాడుకలో ధనము అంటున్నాము. అష్ట లక్ష్మిలు, అష్టశ్వర్యములు అని భావించి నప్పటికి డబ్బే ప్రధానంగా ఉంటోంది. జీవనోపాధిలో ఇది ప్రత్యేకత సంతరించు కున్నది. ఏమద్రుష్టమో కాని చదువుకోవటానికి కూడా ధనమే ప్రధానమవుతోంది. చదువు లేకపోతే జీవనోపాధి సరిగా ఉండదు. జీవనోపాధి లేకపోతే ధనమే రాదు. అందుచేత ఈ హోమము జరిపించుకున్నట్లైనా దైవికముగా మనలో చైతన్యము ఏర్పడి మన పరిస్థితిని బట్టి దాని సంబంధిత వృత్తిలో దృష్టి సారించు కుని ఆర్థికముగా నిలదొక్కుకునే అవకాశము ఉంటుంది అనుటలో సందేహము లేదు.

4. సరస్వతీ హోమము

      సరస్వతీ దేవి. ఈ దేవత తెలియనిదెవరికి. ఈవిడ లేకపోతే అన్నీ జీరోలే. జీరోలప్రక్కన ఉన్న ఆ ఒకటి ఆవిడే. బుద్ధి, జ్ఞానము,మేధస్సు ఇవన్నీ విద్య అనే పేరుతో సరస్వతీదేవినే మనము ఉపాసిస్తున్నాము. ఈ హోమము చేయుటవలన మనలో నాలుక, మెదడు, హృదయస్పందన ఇవి అన్ని చైతన్యమవుతాయి. జ్ఞానము ఉన్నా లేదా పొందినా ఆ వ్యక్తి ఎలా ఉంటారు అంటే వీణానాదము ఎంత మృదుమధురంగా ఉంటుందో అంత చక్కగా సంస్కారవంతులై ఉండి గురుతత్త్వముతో పది మందికి జ్ఞానోపాసన చేసే అవకాశము కూడా ఏర్పడుతుంది. ఏ విషయములోనైనా సమయాను కూలముగా విచక్షణతో నిర్ణయమును తీసుకునే మేధస్సు లభిస్తుంది. దానివల్ల
మనతోపాటు సమాజంకూడా అభివృద్ధి అవుతుంది అనుటలో సందేహములేదు.

5.సుదర్శన హోమము

    మన జీవనకాలంలో ఎంత సుఖవంతంగా ఉండాలని అనుకుంటామో కాని విధివశాత్తు అప్పుడప్పుడు చిన్నగా కష్టము కావచ్చు,దుఃఖము కావచ్చు, అనోరోగ్య సమస్యలు కావచ్చు, బంధు మిత్రుల కలహాలు కావచ్చు, ముఖ్యంగా నరదృష్టి, అంతర్గత శత్రువులు, లేదా ఆర్థిక ఋణసమస్యలు ఇట్లాంటి వాతావరణము కనిపించినప్పుడు ఈ హోమము జరిపించుటచే మానసిక ప్రశాంతత, మనోబలము, ధైర్యము కలిగి సమస్యల నుండి భగవదనుగ్రహముతో విముక్తి కలుగుతుంది అనుటలో సందేహము లేదు.

6. మృత్యుంజయ హోమము

    క్షీరసాగర మధనంనుంచి ఉద్భవించిన కాలకూట విషాన్ని సేవించినటువంటి పరమశివుడు మృత్యుంజయుడైనాడు.మనస్సు, శారీరక బలము పొందటానికి నెగిటివ్ అనర్జీని తొలగించుకోవటానికి ఊహించకుండా అంటే అప్పటికప్పుడు ఏదైనా ప్రమాద పరిస్థితులు ఏర్పడి నప్పుడు కాని, గండకాలములని తెలిసినపుడు కాని భయభ్రాంతులైనప్పుడు కాని అకాల మరణములు జరుగకుండ వుండుటకు ఆరోగ్యం, సౌభాగ్యం, దీర్ఘాయుష్షు పొందుట కొరకు ఈ మృత్యుంజయ హోమము జరిపించుటచే ఆ పరమేశ్వరుని అనుగ్రహము కలుగుతుంది అనుటలో సందేహము లేదు.