జప శాంతులు

నిత్య జీవనంలో విద్యార్ధి దశనుంచి చివరివరకు మనకు అనేక విధులు
వుంటాయి. అవి నిర్వర్తించేటప్పుడు ఆదమరపుగా వున్న యెడల ఏదో ఒక
అవాంతరము ఏర్పడుట గాని లేదా పనులు వాయిదా పడుటగాని ఒకటి
అనుకుంటే మరొకటి ఏదో ఎదురుపడుట గాని అది ఒక సమస్యగా మారటము అట్లాంటి సమయమునే చదువు విషయంలో గాని ఆరోగ్య విషయంలో గాని, ఆర్ధిక లావాదేవీల విషయంలో గాని కుటుంబ సమస్యలు గాని ఏవైనప్పటికి వాటికి సంబంధిత గ్రహములకు అధిష్ఠాన దేవతలకు కూడా జపములు ఆచరించుటచే ఎంతో కొంత ఉపశమనము ఏర్పడుతుంది అనుటలో సందేహము లేదు. ఒక వ్యక్తికి భయంకరమైన కాలు నొప్పి వచ్చింది. డాక్టరు ఆపరేషను చేయాలన్నాడు. డైరెక్టుగా ఆపరేషను చేస్తే ఇంకా భయంకరమైన నొప్పి వస్తుంది. అందుకని డాక్టరు అనస్థీషియా ఇచ్చి రెండు నొప్పులూ తెలియకుండా నొప్పిని నివారిస్తాడు. అంటే ఇవి ఆచరించుట వలన కొత్త నొప్పి తెచ్చుకోకుండా వున్న నొప్పి కూడా తెలియకుండా ఉపశమనం కలిగే అవకాశము వుంటుంది అనుటలో సందేహము లేదు.