రత్న ధారణ

సూర్యుడు - కెంపు

ఇది ధరించుటచే ఆత్మవిశ్వాసము, వృత్తిలో ఉన్నతాధి కారం, తండ్రివైపువారి బంధబాంధవ్యములు కలిగి ఉండుట, ఆస్థులు కలయిక, మగసంతానము ఇత్యాది అవకాశము వుంటుంది.

చంద్రుడు - ముత్యము ధరించుటచే

తల్లివైపు బంధబాంధవ్యములు కలుగుట, ఆదరణ, స్త్రీ సంతతి, మనస్సు ప్రశాంతత ఇత్యాది అవకాశము వుంటుంది.

కుజుడు-పగడము

ఇది ధరించుటచే , చైతన్యము, సాహసము, సోదర సంబంధ బంధ బాంధవ్యములు , మగ సంతతి, వివాహ జీవిత ఆనందము శత్రు రోగ రుణ విముక్తి ఇత్యాది అవకాశము ఉంటుంది

బుధుడు - పచ్చ

ఇది ధరించుటచే , ఎప్పటికప్పుడు జీవనములో మార్పులు చేసుకోనుట విద్య, వ్యాపారము కలిసి వచ్చుట బంధు వర్గము ద్వారా స్నేహ సంబధములు ఎత్యాది అవకాశం ఉంటుంది

గురుడు - పుష్యరాగము

ఇది ధరించుటచే దైవిక జ్ఞానము, మగసంతతి, సంతాన అభివృద్ధి, గృహ, వాహనాదులు ఇత్యాది అవకాశము వుంటుంది.

శుక్రుడు - వజ్రము

ఇది ధరించుటచే అత్తవారి వలన సహకారము, ధన, ధాన్య, గృహ, వాహనాదులకు కళాకారులుగా నైపుణ్యత పొందుట ఇత్యాది అవకాశము వుంటుంది.

శని - నీలము

ఇది ధరించుటచే తన కృషి ఫలితంగా అభివృద్ధి చెందుట, పనిచేయుచోట గుర్తింపు పొందుట, దీర్ఘ ఆయుర్దాయము ఇత్యాది అవకాశము వుంటుంది.

రాహువు - గోమేధికము

ఇది ధరించుటచే విద్యలో ఆటంకములు తొలగుట, సంతానప్రాప్తి, గ్రహపీడలు తొలగుట, ఇత్యాది అవకాశము వుంటుంది. ఈయన కూడా లక్ష్మీయోగాన్ని ఇవ్వగలడు.

కేతువు - వైఢూర్యము

ఇది ధరించుటచే దైవిక జ్ఞానము యజ్ఞ యాగాదులు ఆచరించుట, చేయు పనులలో ఆటంకములు తొలగుట, ఇత్యాది అవకాశము వుంటుంది.