పంచభూతములు - వాస్తు

ఆకాశము

అనంతమైన పరిధిలు లేనిది ఆకాశము. అట్లాంటి శూన్యమున వెదజల్లబడిన కంటికి ఇంపుగా మెరిసిపోతు కనిపించే నక్షత్రముల గుంపులే పాలపుంతలు. ఇవి అనంతము. ఈ పాలపుంతలలో ఒకటి అయినది మన సౌర కుటుంబము. ఈ ఆకాశమునకు శబ్ద గుణము కలిగి ఉన్నది.

వాయువు

ఈ భూమి చుట్టూ గాలిలో మిళితమై ఉన్న వాయువులలో జీవరాశులు బ్రతకాలంటే ఆక్సిజనే మూలము. ఈ వాయువు శబ్దముతో స్పర్శ
గుణాన్ని కలిగి వుంది.

అగ్ని

 సూర్యునినుండి భూమి వేడి వెలుతురుని గ్రహించుట వలన ఇక్కడ మనుగడ ఏర్పడింది. అగ్నికి శబ్ద, స్పర్శలతో పాటు రూపగుణము కూడ కలిగి ఉంది.

నీరు

భూమిచుట్టూ ఉన్న ఉష్ణవాయువులు చల్లబడి మేఘాలు వర్షించుట వలన ఏర్పడిన జలప్రాంతములు ఈ జీవరాశులకు ఆధారభూతమైనది. హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికయే నీరు. ఈ నీటికి శబ్దము, శ్పర్శ, రూపములతో పాటు రసగుణము కూడ కలిగి ఉంది.

భూమి

ఈ గ్రహములలోని ఒక గోళమే ఈ భూమి. ఇది ఒక అయ స్కాంతము. భూమికి ఉన్న ఉత్తర దక్షిణ ధృవాలు దక్షిణ ధృవము, ఉత్తరార్ధ గోళములోను, ఉత్తర ధృవము దక్షిణార్ధ గోళములోను ఉంటాయి. అందువలనే కంపసు సౌత్, నార్త్ చూపిస్తుంది. సజాతి ధృవాలు వికర్షించు కొనుట, విజాతి ధృవాలు ఆకర్షించుకొనుట జరుగుతుంది. రెండు ధృవాలు విడదీయబడవు. వాస్తు పరంగా దక్షిణదిక్కున బరువు వుండాలని, దక్షిణ దిక్కున తలవుంచి నిద్రపోవాలని అనేది కూడ ఆరోగ్య సూత్రమే. భూమికి శబ్ద, స్పర్శ, రూప, రసాలతోపాటు గంధమనే గుణంకూడా కల్గి వుంది.