15. వేమన గురుతత్త్వము​

15. వేమన గురుతత్త్వము సద్గురువును ఆశ్రయించుటవలన శులభముగ మోక్షమార్గమును పొందవచ్చును. శ్రమలేకుండా సమస్యలను దాటవచ్చును. మంచి ఆహారము తీసికొనుట వలన మంచి గుణములు వచ్చునట్లు సద్గురు బోధనలవలన మంచి ప్రవర్తన కలిగి మోక్షమును పొందవచ్చును. యజ్ఞ యాగాదులు, తపస్సు, తీర్థయాత్రలు, చేసినప్పటికి స్వామిని కనుగొనలేరు. పరమాత్మను చేరుకొనే విధానమును గురువు మాత్రమే బోధించగలడు. కాలమును వృధా చేయకుండా గురువును చేరి వారి మార్గమును విశ్వశించి ఆచరించినట్లయిన మోక్షమును పొందవచ్చును. గురువును బాగా సేవించి మనస్సుతో విన్న దానిని […]

14.పతి వ్రతముచే – స్త్రీ ఆదిశక్తి

14.పతి వ్రతముచే – స్త్రీ ఆదిశక్తి స్త్రీ తమ భర్తని పరమేశ్వరునిగా భావించాలి. విసుగులేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా దానధర్మాలు చేయరాదు. ఇరుగుపొరుగు ఇళ్లకు తరచు వెళ్లరాదు. తప్పనిసరి అయినపుడు ఇంట్లో మరొక మనిషితో వెళ్లి పని చూసుకు రావాలి. ఒంటరిగా ఎచటికి ఎప్పుడూ వెళ్లరాదు. దుష్టప్రవర్తన గల స్త్రీలతో స్నేహం చేయరాదు. భర్త బయట నుంచి రాగానే సంతోషంగా ఎదురేగి స్వాగతించి అలసట తీరువరకు సేదతీర్చాలి. అతని ఇష్టాన్ని అనుసరించి ఆరోగ్యకరమైన ప్రీతికరమైన […]

13.శాంతి విధానేన రోజువారి పారాయణలు

13.శాంతి విధానేన రోజువారి పారాయణలు ఆదివారము : ఆధిపత్యము – రవి, అధిదేవత – అగ్ని, ప్రత్యధిదేవత – ఋద్రుడు, అధిష్ఠాన దేవత – శివుడు, నవదేవీ మాత – గాయత్రీదేవి, పరమాత్మ అంశ – రామావతారం. పారాయణకు : రవి అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, శివ అష్టోత్తరము, రామ అష్టోత్తరము, గాయత్రీ అష్టోత్తరము. సోమవారము : ఆధిపత్యము – చంద్రుడు, అధిదేవత వరుణ, ప్రత్యధిదేవత – గౌరీదేవి, అధిష్ఠాన దేవత – భువనేశ్వరీ దేవి, నవదేవీ […]

12.ముఖ్య జ్యోతిష విషయములు

12.ముఖ్య జ్యోతిష విషయములు 1. మాసము : శుక్లపక్షము, కృష్ణపక్షము అను రెండు పక్షములు కలదియు, ముప్పదిvతిథులు ఆత్మగా కల కాలమును మాసము అందురు. 2. సౌరమాసము : సూర్యుడు ఒకరాశి నుంచి మరియొక రాశిలోనికి ప్రవేశించు మధ్యకాలమును సౌరమాసము అందురు. మేషమాసము, వృషభ మాసము అను వ్యవహరము తమిళనాడు మొదలగు దక్షిణ ప్రాంతములందు వ్యవహారమున ఉన్నది. 3. సావనమాసము : రెండు సూర్యోదయములకు మధ్యగల కాలమును సావన దినము అందురు. అనగా 24 గం॥ లు […]

11.దేవాలయమున అర్చకుడు – భక్తుడు

11.దేవాలయమున అర్చకుడు – భక్తుడు భగవంతునికి – భక్తునికి మధ్య అనుసంధానమే దీక్ష పొందిన అర్చకుడు. అర్చకుని సంస్కారమువల్ల అర్చనలో విశిష్టత వల్ల ప్రతిమా రూపమువల్ల ఆలయములో భగవంతుడు సన్నిహితుడు అవుతాడు. శిల్పి చెక్కిన శిలా విగ్రహాన్ని దేవునిగా రూపొందించటము అర్చకుని చేతిలో ఉంటుంది. అర్చకుడు తన గుణమువలన, నడవడివల్ల అర్చన విధులను నిర్వహణలో చూపే శ్రద్ధవల్ల మాత్రమే ప్రతిమలో దైవతత్వాన్ని సాధిస్తాడు. దేవాలయము ప్రజలందరికి చెందిన వ్యవస్థ. కావున దైవ సంబంధిత విషయాలు లౌకికమైన విషయాలు […]

10.నిత్య దేవతార్చనచే – ప్రశాంత జీవనం

10.నిత్య దేవతార్చనచే – ప్రశాంత జీవనం వైదికము, సనాతనము, ధర్మశాస్త్రము అనుసరించి స్వధర్మ ఆచరణ చేయుటయే భగవంతుని ఆరాధన. మనకి ఉన్న దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణములను నిత్య కర్మలను ఆచరించుటద్వారా విముక్తులము అవగలము. స్నానము, సంధ్య, గాయత్రీ జపము, దేవతార్చన, వైశ్వదేవీ – బలి, స్వాధ్యాయము ఇత్యాది ఎవరు ఆచరించెదరో వారి బుద్ధి నిశ్చలతత్వమున ఉండగలదు. దానివలన సమతత్త్వము వివేకము ఏర్పడును. ప్రాతఃసంధ్య వలన రాత్రియందు చేసినపాపములు, సాయం సంధ్యవల్ల పగటియందు చేపిన […]

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము తోటి మనిషితో ఎట్లా ప్రవర్తించాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటము, ఇంటికి వచ్చిన అతిథులతో గౌరవించుకొనటము, మంచి సాంప్రదాయ సంస్కారములతో బ్రతుకు వెళ్లబుచ్చటము, ఇతరులకి ఇష్టములేని పని చేయకుండటము, మనము చేసే పని ఇతరులకు ఇబ్బందిలేకుండా వుండే జీవనము ఎంచుకొనుట, నిత్య దేవతార్చన చేసికొనుట, మానవ సేవయే మాధవ సేవ అనునట్లు ఇతరులకు సంఘానికి ఉపయోగ పడుట, అందరిని సమతత్త్వముతో చూసుకొనుచు జీవన సాగరము సాగించు వారికి స్వర్గము ఎప్పుడు […]

8.ఎంత గొప్పవాడు ఏలినాటి శని

8.ఎంత గొప్పవాడు ఏలినాటి శని ఎవరినోట విన్నా ‘కొంప ముంచాడురా శనిగాడు’ అంటుంటారు. లేదా అయిదు సంవత్సరములనుంచి పడే బాధలు ఏమి చెప్పమంటారు. ఆరోగ్యం కృంగిపోయింది, ఆర్ధికంగా అంటావా ఆపరేషనుకు రెండు లక్షలు అయ్యాయి. ఇంతలో పక్కింటివాడు ఇప్పుడు ఎలా ఉంది అంటే బ్రతికి బయట పడ్డానులేరా ఫరవాలేదు, డబ్బుకూడ కొంత ఆరోగ్యశ్రీలో ఇచ్చారనుకో. ఇంకేమిటి మరి బాగానే ఉందికదా అంటాడు పక్కింటివాడు. అసలు కలియుగంలో ఎవరైతే నామీద దృష్టిపెట్టి తనపని తాను ధర్మమార్గములో నిర్వర్తించుకుంటూ ఉంటారో […]

7.ముహూర్తమునకు గ్రహగతులే ముఖ్యమా!

7.ముహూర్తమునకు గ్రహగతులే ముఖ్యమా! మనము ఏ కార్యానికైతే ముహూర్తాన్ని నిర్ణయిద్దామని అనుకుంటామో అంటే అక్షరాభ్యాసమా, ఉపనయనమా, వివాహమా, వ్యాపారమా, గ్రుహప్రవేశమా ఏమైనా కావచ్చు ఒకొక్క కార్యానికి ముహుర్త భాగములో ఒకొక్క భావము పర్టిక్యులర్గా శుద్ధిగా ఉండాలని ఉంటుంది. అలాగే ఆ కార్యానికి సంబంధించిన కారక గ్రహములు భావాధిపతులు లగ్నస్థితి ఇవన్ని డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటాయి. ముహూర్తాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అలాగే కార్యాన్ని బట్టి తారలను ఎంచుకొనవచ్చు. కొన్ని సందర్భాలలో క్షేమతార, కొన్ని సందర్భాలలో సాధనతార, […]

6.రత్న ధారణకు సంశయాలే

6.రత్న ధారణకు సంశయాలే ప్రస్తుత సమాజములో ఎవరికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి వారివారి విధానాన్ని బట్టి చెబుతూ ఉంటారు. మరి అందరూ తలోరకంగా ధరించమంటుంటే ఏది ఆచరించాలి అనేది రత్నం ధరించేవానికి సందేహంగానే ఉంటుంది. మరి ఎలా? 1. ఒకరు జన్మ నక్షత్రాన్ని తెలుసుకొని నక్షత్రాధిపతిని బట్టి దానికి సంబంధించిన రత్నం ధరించమని చెబుతారు. 2. మరొకరు జన్మరాశి ఏది అని ఆ రాశ్యాధిపతిని బట్టి దానికి సంబంధించిన రత్నం ధరించమని చెబుతారు. 3. మరొకరు జరుగుతున్న […]